ఏపీ ఫ‌ర్ సేల్‌.. జగనన్న ఉగాది కానుక..!

Publish Date:Feb 13, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ఎటుగా పడుతున్నాయి? ముఖ్యమంత్రి అలోచనలు ఎటుగా సాగుతున్నాయి? తెలుగు వారి కొత్త సంవత్సరం, ఉగాది నుంచి, కొత్త బాటలో సాగాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారా, అలాగే మద్యంలాగానే, రియల్ దందాను సర్కార్ పరం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారా అంటే, కొంచెం అటూ ఇటుగా అలాంటి ఆలోచనలే జరుగ్తుతున్నాయని, అంటున్నారు.రానునన్ రెండేళ్ళు భూ దందానే ప్రభుత్వ ప్రధాన వ్యాపకంగా ఉంటుంది అంటున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉగాదికి ముందే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోవాలని, తెలుగు సవత్సరం తొలిరోజు నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. అయితే కనీస మౌలిక సడుపాయాలు, అధికారులు, సిబ్బంది పపంకాలు ఏమీ  కాకుండానే రెండు నెలల వ్యవధిలో ‘కొత్త’ ఆలోచనలు ముడి పడతాయా లేదా అనేది అనుమానమే అయినా,అసలు ఈ ఆలోచన వెనక ఉన్న రహస్యం ఏమిటనే ప్రశ్న రాజకీయ  వర్గాల్లో వినవస్తోంది. 

నిజానికి, కొత్త జిల్లాలు, కొత్త పరిపాలన కంటే, కొత్త రాజధానే ముఖ్యమంత్రి మనసులోని ఆలోచన అని, అందుకే ఆయన ఆరు నూరైనా, నూరే ఆరైనా  ఉగాది నుంచి కొత్త జిల్లాలు కొలువు తీరాలని వెంట పడుతున్నారని, అధికారులు అంటున్నారు. ‘చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన’ అన్నట్లుగా ముఖ్యముఖ్య మంత్రి జగన్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పటు వలన ఇతర ప్రయోజనాల మాట ఎలా ఉన్నా, భూముల ధరలకు రెక్కలోస్తాయి. 

రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ జనగామా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, జనగామ జిల్లా ఏర్పాటు వలన కరవు జిల్లాలోనూ భూముల ధరలకు రెక్కలోచ్చాయని, మూడు ఎకరాలున్న రైతు కూడా కోటీశ్వరుడు అయ్యాడని పేర్కొన్నారు. అదే విధంగా ఏపీలోను కొత్త జిల్లాల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలొస్తాయి. అందుకోసమే ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

అదలా ఉంటే, ఉగాదికి కొత్త జిల్లాలే కాదు, కొత్త పరిపాలనా  రాజదాని  ‘విశాఖ’ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని కూడా అంటున్నారు. అదే రోజు నుంచి పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇటీవల ఎంపిక చేసిన సినిమా పెద్దలతో  జరిపిన చర్చల్లో కూడా ముఖ్యమంత్రి విశాఖ ‘రియల్’  ప్రస్తఃవన చేశారు.అంటే, ముఖ్యమంత్రి విశాఖ కేంద్రంగా పని చేసేందుకు, మెల్లి మెల్లిగా ఒక్కొక కార్యాలయాన్ని అక్కడికి  తరలించేందుకు సిద్దమై పోయారని తెలుస్తోంది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి కార్యాలయాలను తరలిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పలుసార్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే, ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయం జరిగిందని అంటున్నారు.  ఏయూలోని ‘విద్యాభవనం’లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేయొచ్చని విశాఖ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.మరో వంక ఇతర కర్యాలయాల కోసం  ప్రైవేటు భవనాలను లీజుకు తీసుకనే పనులు కూడా మొదలయ్యాయి. ఇందుకోసం  తొట్లకొండపై గ్రేహౌండ్స్‌ కార్యాలయం, కొన్ని ప్రైవేటు ప్రాంగణాలు ప్రభుత్వ  పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అలాగే, దాదాపు 200 ఎకరాల్లో కాపులుప్పాడలోని కొండపై అభివృద్ధి ఐటీ లేఅవుట్‌ రెండున్నరేళ్లుగా ఖాళీగానే ఉంచారు. పిఠాపురం కాలనీలో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూడా కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. గంభీరం వద్ద మూసేసిన ఓ ప్రైవేటు కళాశాలలో, మధురవాడ ఐటీ హిల్స్‌లో పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 10 అంతస్తుల్లోని మిలీనియం టవర్స్‌లో టవర్‌-బి నిర్మాణం చాలావరకు పూర్తయింది. వీటిలో కార్యాలయాలకు ఏవి ఉపయోగపడతాయో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా ఎక్కడో అక్కడ సిద్ధం చేసి ఉంటారని భావిస్తున్నారు. అదలా ఉంటే, ఉగాది రోజున లేదా అంతకంటే ముందుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందని అంటున్నారు. ఉగాదికి కొత్త ఆలోచనలు చేయడం మంచిదే, కానీ, రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టే ఆలోచన ఉగాది రోజు చేస్తునారా,అనేది అనుమానం.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.