మహా సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ.. ఏం అడిగారంటే?

Publish Date:Jun 30, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మంగళవారం (జూన్ 30) భేటీ అయ్యారు. తన వైద్య చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్ మహారాష్ట్ర సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు ముంబైలోని అంబానీ ఆస్పత్రిలో చేరేందుకు ఆయన తన సతీమణితో కలిసి ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చేరడానికి ముందు మహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్ ఆయనను రాష్ట్రానికి రెండు ఆడపులలను ఇవ్వాలని కోరారు.

అందుకు ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అడవులు, వన్యప్రాణుల అభివృద్ధి కోసం అరహారం శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర నుంచి రెండు ఆడపులులను రాష్ట్రానికి రప్పిస్తే..  రాష్ట్రంలో పులుల సంఖ్య పెంపునకు దోహదమౌతుందని ఆయన భావిస్తున్నారు.  

కాగా ఈ భేటీలో పవన్, ఫడ్నవీస్ ల మధ్య ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై  చర్చ జరిగింది. ముంబైలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో  పులుల సంరక్షణపై చర్చించారు.  రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఇచ్చి పుచ్చుకోవాలని ఇరువురు నేతలూ నిర్ణయించారు.  

By
en-us Political News

  
ఈ వివాదానికి కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుత తరుణంలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు ఊహించని విధంగా భారీ చుక్కెదురైంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, ఐఏఎస్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఫిఫా వరల్డ్ కప్ అనేది ఆటగాళ్ల జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కల.
రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకున్న సాయి–పద్మ దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక్కసారిగా సంభవించిన ఒక ఘోర ప్రమాదం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
ఇటీవల ఓ సందర్భంలో ప్రభుత్వ ప్రజారవాణా బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్.. ఆ బస్సు ప్రయాణం తరువాత రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకురాష్ట్ర ప్రభుత్వం ఇకపై కొనుగోలు చేసే బస్సులన్నీ ఏపీ సౌకర్యంతో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తమ మధ్య వైవాహిక వివాదాలు ఉన్నాయని, తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలు ఉన్నాయని అరుణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై 2017 జూన్‌లోనే కేసు నమోదైనట్లు పేర్కొన్న ఆమె.. ఒకవేళ ఇప్పుడు ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తే.. తన జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో ఉన్నతమైన హోదాల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్ అధికారిణి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఈ ఫేక్ వీడియోలు ఉన్నాయంటూ తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.