ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేయండి.. ఐపీఎస్ సునీల్ కుమార్ భార్య

Publish Date:Jun 30, 2026

Advertisement

స్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు ఆయన భార్య షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న సునీల్ కుమార్ ఈ రోజే పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగానే..  ఆయనకు అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆయన భార్య పి. అరుణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పిటిషన్ సమర్పించారు.

 తమ మధ్య వైవాహిక వివాదాలు ఉన్నాయని, తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలు ఉన్నాయని అరుణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై 2017 జూన్‌లోనే కేసు నమోదైనట్లు పేర్కొన్న ఆమె.. ఒకవేళ ఇప్పుడు ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్  అందిస్తే.. తన జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని  ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ  హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సునీల్ కుమార్.. అప్పట్లో ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం అపారమైన సహజ వనరులకు, అరుదైన ఖనిజాలకు నిలయంగా మారింది.
అయోధ్య రామాలయం, విరాళాల వివాదం, రాముడి నిధుల దుర్వినియోగం, సిట్ విచారణ, యోగి ఆదిత్యనాథ్
శిల్పాకళా వేదికగా రైతు భరోసా నిధులు విడుదల...
దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది.
విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది
పుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయి
ఈ వివాదానికి కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుత తరుణంలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు ఊహించని విధంగా భారీ చుక్కెదురైంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.