ఎమ్మెల్యేలతో జగన్ ఫేస్ టు ఫేస్.. అందుకోసమేనా? 

Publish Date:Sep 1, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 27 నెలలు పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు కావస్తున్నా.. పార్టీపై ఆయన ఫోకస్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ ను కలవలేకపోతున్నారు. కొందరు మంత్రులకు కూడా సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తమకు అవకాశం దక్కటం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అడిగిన నిధులను మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని తెలుస్తోంది. కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఉన్న అభిప్రాయలను పార్టీ సమన్వయకర్తలు సీఎంకు వివరించారుట. దీంతో  పార్టీపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన జగన్.. త్వరలో సమావేశాలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

పార్టీలో ప్రక్షాళనతో పాటు కేబినెట్ విస్తరణకు జగన్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. జగన్ తో సమావేశానికి రావాలటూ ఎమ్మెల్యేలకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయని చెబుతున్నారు, ఎమ్మెల్యేలతో  ఫేస్ టు ఫేస్ మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారట జగన్. ఇందు కోసం సెప్టెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే  ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.   ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పని తీరు వంటి వాటి పైన సీఎం అంతర్గత సర్వేలు చేయించారు. వాటి నివేదికలను సిద్దం చేసుకున్నారని చెబుతున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో జరిగే సమావేశాల్లో.. నియోజకవర్గానికి సంంబధించిన సర్వే వివరాలను వాళ్ల ముందు ఉంచనున్నారట. సర్వేల ఆధారంగానే  ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లాస్ ఉంటుందని అంటున్నారు.

ఎమ్మెల్యేలు అందరితో కాకుండా.. వన్ టు వన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం.  ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటుగా వారి బలాలు- బలహీనతల పై సీఎం నేరుగా చర్చించనున్నారని తెలుస్తోంది.  ఆరోపణలు ఉన్న వారికి హెచ్చరికలు చేయడంతో పాటు పని తీరు బాగున్న వారికి  ప్రమోషన్ దక్కే అవకాశాల గురించి సీఎం నేరుగా వారితోనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.  సీఎం-ఎమ్మెల్యేల ఫేస్ టు ఫేస్ సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు, మంత్రులకు ఎవరూ లేకుండా ఎమ్మెల్యేలే నేరుగా సీఎంతో మాట్లాడే విధంగా అవకాశం కల్పించనున్నారని చెబుతున్నారు. 

ఎమ్మెల్యేలతో జరిగే భేటీల్లోనే కేబినెట్ అవకాశాలపైన మనసులో మాట చెప్పనున్నారట ముఖ్యమంత్రి. కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం తన అభిప్రాయాలను ఆశావాహ ఎమ్మెల్యేలకు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.   ప్రభుత్వంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చేస్తున్న కసరత్తు ఇప్పటికే దాదాపుగా  పూర్తయిందని తెలుస్తోంది. ఈ సమీక్షల్లో ఆశావాహులకు సీఎం నేరుగా తన అభిప్రాయం చెప్పటంతో పాటుగా.. అవకాశం ఇవ్వలేని వారికి భవిష్యత్ పైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణ సమయంలో ఏ ఒక్కరి నుంచి ఓపెన్ గా అసంతృప్తి బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు.  పార్టీ బాధ్యతల విషయంలో సీఎం మరింత స్పష్టంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం.

అక్టోబర్ 2 నుంచి రచ్చబండ ద్వారా సాధ్యమైనంత కాలం ప్రజల్లో ఉండాలనేది జగన్ భావిస్తున్నారట. ఈ లోగానే ఎమ్మెల్యేలతో సమావేశాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సీఎం తమతో నేరుగా మాట్లాడేందుకు సమయం కేటాయించటం పైన ఎమ్మెల్యేల్లో జోష్ కనిపిస్తోంది.  దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారు..ఎవరిని పక్కన పెడతారనే చర్చ మాత్రం పార్టీ నేతల్లో టెన్షన్ కు కారణమవుతోంది.  ముందుగా చెప్పిన విధంగా ప్రస్తుత కేబినెట్ లో 90 శాతం మందిని తప్పిస్తారా..లేక మొత్తం కేబినెట్ నే మర్చేస్తారా అనే టెన్షన్ ప్రస్తుత మంత్రుల్లో కొనసాగుతోంది. దీంతో  ఆశావాహులు సైతం సీఎం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారని చెబుతున్నారు. 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.