రాజధాని లేని రాష్ట్రం.. జగన్ నిర్వాకం.. పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం

Publish Date:Feb 12, 2023

Advertisement

మొండివాడు రాజుకంటే బలవంతుడు, ఇక రాజే మొండివాడయితే, ఆ రాజ్యం, నేటి ఏపీ  అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ముక్కలై, నవ్యాంధ్ర  ప్రదేశ్ రాష్టం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలైంది, అయినా ఇంతవరకు,రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ  మిగిలిపోయింది. నిజానికి, రాష్ట్ర విభజన జరిగిన వెంటనే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా దివ్యభవ్య రాజధాని నిర్మాణానికి, శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

అయితే  బాలారిష్టాలను దాటుకుని, రాజధానికి ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో, ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపే అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన,మాట తప్పారు, మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి, అదే సభలో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే,అధికార వికేద్రీకరణ వంకన మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడి మూడు రాజధానుల ప్రకటన చేశారు.ముఖ్యమంత్రి ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని లేకపోవడమే రాష్ట్రాభివృద్ధికి పెద్ద ప్రతిబంధకంగా మారింది. 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడగానే అమరావతిని కాదని మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడం తెలిసిందే. ఇక అప్పటి నుంచీ రాష్ట్రానికి రాజధాని ఏదన్న విషయంలో ఎర్నడిన గందరగోళం రాష్ట్ర అభివృద్ధని ప్రశ్నార్థకం చేసేసింది. జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. విశాఖ, కర్నూలు అంటూ ప్రభుత్వం మాటలు చెప్పిందే కానీ.. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడిన దాఖలాలు లేకుండానే నాలుగేళ్లు గడిచిపోవచ్చాయి.

ఇక అదే రాజధాని విషయంలో ఉన్న ప్రతిష్ఠంభన మీమాంస కారణంగా రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా? లేదా అన్నది ఓ పెద్ద సందేహంగా మారిపోయింది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసన వ్యవహారాల రాజధానిగా ఉంటాయని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంటూ ముఖ్యమంత్రి అ జగన్ ప్రకటించిన తరువాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధాని అంటూ లోక్ సభ సాక్షిగా ప్రకటించే వరకూ.. ఏపీ అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రం అంత విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా విశాఖ రాజధాని అంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు అయోమయాన్ని ఇంకా కొనసాగించేందుకే ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది.

అయితే.. కోర్టులో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి జగన్ హస్తినలో జరిగిన ఏపీ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో చేసిన విశాఖ రాజధాని అన్న వివాదాస్పద వ్యాఖ్యలు సైతం గందరగోళాన్ని మరింత పెంచేవిగానే ఉణ్నాయి. ఇలాంటి గందరగోళం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలను ఎంతగా దెబ్బతీస్తోందో ఈ  మూడున్నరేళ్ల పైబడిన కాలంలో చూస్తూనే ఉన్నాము. 2015 ఏప్రిల్ లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. అప్పటి నుంచీ రాజధాని విషయంలో అయోమయం, గందరగోళం కొనసాగుతూనే ఉంది.   ఇన్నేళ్ల పాటు రాజధాని అన్నది లేకుండా రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది. పలు అవకాశాలను చేజార్చుకుంది. పెట్టుబడుల విషయంలో అధ:పాతాళానికి దిగజారిపోయింది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.