ఉభయ తారకం

Publish Date:Feb 11, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ తీరేమిటో? వైఖరి ఏమిటో అంతుబట్టని విధంగా ఉంది. ఏ విధంగా చూసుకున్న ఏపీలో బీజేపీకి ఇసుమంతైనా బలం లేదు.  అయిన దానికీ కాని దానికీ మీడియా ముందుకు వచ్చి పాండిత్య  ప్రదర్శన చందంగా ఏవో మాటలు మాట్లాడే ఒకరిద్దరు నేతలు తప్ప బీజేపీకి రాష్ట్రంలో నాయకత్వం అన్నది దాదాపు పూజ్యం. అదే విధంగా జనాదరణ విషయంలో కూడా ఆ పార్టీ పరిస్థితి చెప్పుకోవడానికి ఏమీ లేదన్న చందంగానే ఉంది. తెలుగుదేశంతో పొత్తు లేని ఏ సందర్భంలోనూ ఆ పార్టీ ఏపీలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకున్న దాఖలాలు లేవు. తగుదునమ్మా అని ఇటీవలి కాలంలో ఒంటరిగా పోటీ చేసిన ఉప ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి బీజేపీది. అలాంటి బీజేపీ ఏపీలో వేగంగా సంభవిస్తున్న రాజకీయ పరిణామాల పట్ల ఎందుకు అంత ఉదాశీనంగా ఉంటుందన్నది పరిశీలకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీలోకి దిగిన బీజేపీ ఏపీలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కారణాని ఏపీలో జరిగే ప్రతి అంశంలోనూ ఆ పార్టీ తీరేమిటన్నదే ప్రాధాన్యతా అంశంగా మారిపోయింది.

అలాంటి ప్రతి ప్రాధాన్యత అంశంలోనూ బీజేపీ వ్యవహార తీరు తామరాకు మీద నీటుబొట్టు చందంగానే ఉంది. మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం తీరుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదా అన్న అనుమానాలు కలిగేలా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. తీరా పార్లమెంటు వేదికగా విషయం తేల్చాల్సి వచ్చే సరికి జగన్ సర్కార్ ను నట్టేట్లో ముంచింది. ఇలా ఏ విషయం తీసుకున్నా.. ఏపీ విషయంలో బీజేపీ ఆలోచన ఏమిటి? తీరేమిటి? అసలు ఏపీ విషయంలో ఆ పార్టీకి ఉన్న ఆశలేంటి? రాజకీయంగా ఏపీ నుంచి ఆ పార్టీ ఆశిస్తున్నదేమిటి? అన్న ప్రశ్నలకు తలలు పండిన రాజకీయ పండితులు కూడా తలలు బద్దలు కొట్టుకునేంత మిస్టీరియస్ గా వ్యవహరిస్తోంది. రాజకీయంగా ఏపీలో బీజేపీకి జనసేన మిత్రపక్షం. అదే సమయంలో తెలుగుదేశం వైరి పక్షం. గత ఎన్నికలు ముందు దాకా ఎన్డీయే భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం.. ఆ తరువాత ఏపీ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ తెగతెంపులు చేసుకుంది. అప్పటి నుంచీ ఇరు పార్టీల మధ్యా వ్యవహారం ఉప్పు, నిప్పుగానే ఉంది. కానీ మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేడి రాష్ట్రంలో రాజుకోవడం ఆరంభించేసరికి బీజేపీకి తెలుగుదేశం విషయంలో పరస్పర రాజకీయ ప్రయోజనాలు గుర్తుకు వచ్చాయి. కేంద్రంలో అధికారం పదిలం చేసుకోవాలంటే.. అంటే మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించాలంటే.. ప్రతి పార్లమెంటు సీటు ప్రధానమే అన్న విషయం గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆ పార్టీ భారీగా ఆశలు పెట్టుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

ప్రస్తుతం తమ అధీనంలో అంటే తాము అధికారంలో ఉన్న కర్నాటకలో మరో సారి అధికారం చేజిక్కించుకోవాలంటే అద్భుతం జరగాలన్న విషయం ఆ పార్టీకి అవగతమైంది. ఆ రాష్ట్రంలో లోక్ సభ స్థానాలలో విజయం కూడా కష్టమేనని అర్ధమైంది. అందుకే బీజేపీ తెలంగాణపై బాగా ఆశలు పెంచుకుంది. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ అధికారం ఎటూ చాన్స్ లేని విషయమే కావడంతో, ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ తో పొత్తు పెట్టుకుంటే.. పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీల మద్దతు పొందే అవకాశం ఉంటుందన్నది ఆ పార్టీ వ్యూహం, ఆశ, ఆలోచన. ఆ విధంగా చూస్తే.. ఏపీలో పొత్తల విషయంలో ఆ పార్టీ ఒకింత చురుకుగా, జోరుగా, కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అందుకు భిన్నంగా బీజేపీ ఏపీ విషయంలో అనుసరిస్తున్న నిర్లిప్త, ఉదాశీన వైఖరి ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో ఎంతో కొంత జనాదరణ ఉన్న జనసేనతో మైత్రీ బంధంలో ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలోనే అపార అభిమాన జన సందోహం ఉంది. మరో వైపు రాష్ట్రంలో ప్రధాన విపక్షం తెలుగుదేశం మాజీ మిత్రపక్షం. ఆ పార్టీకి రాష్ట్రంలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. పటిష్ట నిర్మాణం ఉంది. జగన్ సర్కార్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది. బీజేపీ ప్రస్తుత మిత్ర పక్షం జనసేన, మాజీ మిత్రపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికలలో కలిసి అడుగులు వేయడానికి ఇప్పటికే దాదాపుగా ఒక అవగాహనకు వచ్చేశాయి.

ఈ పరిస్థితుల్లో కూడా బీజేపీ ఉదాశీనంగా వ్యవహరించడం పట్ల రాజకీయవర్గాలలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో బీజేపీ వ్యూహంపై పలు విశ్లేషణలకు తావిచ్చింది. అసలింతకీ బీజేపీ జనసేన, తెలుగుదేశం పొత్తు విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అధికార వైసీపీతో అవగాహనతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉండగా, బీజేపీ వైసీపీతో జట్టు కట్టడం రాజకీయంగా ఏమంత ప్రయోజనం ఉండదని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి. 

అదీకాక ఏపీలో తెలుగుదేశం కు వ్యతిరేకంగా వెళితే ఆ ప్రభావం తెలంగాణలో బీజేపీపై పడుతుందన్న భావన కూడా బీజేపీ అగ్రనేతల్లో ఉంది. అందుకే ఉభయ తారకంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ ప్రేక్షక పాత్రకే పరిమితం అయితే బెటర్ అన్న అభిప్రాయం ఆ పార్టీ టాప్ బ్రాస్ లో కనిపిస్తోంది. అంటే ఏపీ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా, బీజేపీ మాత్రం జనసేనతో తన మిత్రత్వాన్ని వదులు కోదు. అంతే కాకుండా పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేనల సీట్ల సర్దుబాటులో జనసేన కోటాకు వచ్చిన సీట్లలో రెండో మూడో తనకు దక్కేలా జనసేనతో బీజేపీ అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉంది. అలాగే ఒకటో రెండో పార్లమెంటు సీట్లను కూడా కోరే అవకాశం ఉంది. ఈ ఏర్పాటు వల్ల తెలంగాణ ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం మద్దతు కమలం పార్టీకి లభిస్తుంది. ప్రస్తుతానికైతే బీజేపీ గేమ్ ప్లాన్ ఇదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 


 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.