ఏపీకి కొత్త గవర్నర్.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేనా?

Publish Date:Feb 12, 2023

Advertisement

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌ను కేంద్రం చత్తీస్ ఘడ్‌కు  బదిలీ చేసింది. ఆయన స్థానంలో గత నెలలో   పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించింది. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాక్ కేసులపై తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ కూడా ఒకరు. అటువంటి ఆయనకు   అలా సుప్రీం కోర్టు  న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారోలేదో ఇలా గవర్నర్ గా పదవి ఇచ్చేసింది కేంద్రం. ఏపీ గవర్నర్ బదలీతో పాటు మరికొన్నిరాష్ట్రాల  గవర్నర్ల బదలీ కూడా జరిగినప్పటికీ,  ఏపీ గవర్నర్ బదిలీ మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో పాటు, రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది.

బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ గా యాక్టివ్ గా లేరు. ఇందుకు ఆయన వయస్సు కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు.  అలాగే   ఏపీ ప్రభుత్వం పంపుతున్న వివాదాస్పద బిల్లులు, నిర్ణయాలన్నింటికీ ఆమోద ముద్ర వేస్తూ వచ్చారు. ఆయన ఆమోదించిన పలు బిల్లులు కోర్టుల్లో వీగిపోయాయి. దీంతో గవర్నర్ పై   విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం గవర్నర్ ను హామీగా చూపించి రుణాలు తీసుకున్నా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఏపీ ప్రభుత్వం.. కేంద్రంతో సన్నిహితంగా ఉంటుంది. గవర్నర్  బిశ్వభూషణ్ హరి చందన్‌ను   రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతుగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం అని ఇప్పటి వరకూ అంతా అనుకుంటూ వచ్చారు. అయితే హఠాత్తుగా ఇప్పుడు కేంద్రం ఆయనకు స్థాన భ్రంశం కల్పించడంతో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్న చర్చ మొదలైంది.  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర కాలం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. అలాంటి వేళ..  ఆకస్మాత్తుగా గవర్నర్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో అదీ ఇటీవలే పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించడం పట్ల..  పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది... ఈ కేసులో పాత్రదారులు ఎవరన్నది తెలిసినా.. సూత్రధారులు సైతం బయటకు వచ్చే సమయం అసన్నమైందని అంటున్నారు. 

మరోవైపు  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్...  జగన్ ప్రభుత్వం మధ్య ఎక్కడ ఎలాంటి పొరపొచ్చలు  లేవనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలంటూ.. ఉద్యగ సంఘం నాయకుడు సూర్యనారాయణ... రాజ్‌భవన్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించి రావడం.. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొనడం.. ఆ తర్వాత గవర్నర్‌తో భేటీకి ఉద్యోగ సంఘం నాయకుడికి అపాయింట్‌మెంట్ ఎవరు ఇప్పించారంటూ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి ఆరా తీయడం.. ఆ తర్వాత గవర్నర్ కార్యదర్శి ఆర్పీ సిసోడియాపై బదిలీ వేటు పడిందనే ఓ చర్చ  వాడి వేడిగా సాగింది. అలా గవర్నర్ కార్యదర్శి బదిలీ అయిన కొద్ది రోజులకే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా బదిలీ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాశమైంది. కానీ గవర్నర్ బదిలీ  ఇంత ఆకస్మాత్తుగా జరుగుతుందని ఎవరూ అసలు ఊహించలేదు.  

అదీకాక... పక్కనే ఉన్న తెలంగాణలో గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ మధ్య అగాధం నెలకొన్న సంగతి విదితమే. గవర్నర్, బీఆర్ఎస్ సర్కార్ మధ్య విభేదాలు బహిరంగ రహస్యమే. గవర్నర్ ప్రభుత్వ వైఖరిని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ మంత్రులు కూడా గవర్నర్ పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.   

తెలంగాణలో గవర్నర్‌కు, సీఎం కేసీఆర్  మధ్య కోల్డ్ వార్ జరుగుతోన్నా.. ఆ  రాష్ట్రంలో గవర్నర్  జోలికి వెళ్లకుండా.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ ను బదలీ చేయడం పలు ప్రశ్నలకు తావిచ్చింది.  ఆయోధ్య తీర్పు వెలువరించిన అయిదుగురు జడ్జిల ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి,  అలాగే ట్రిపుల్ తలాక్ చెల్లదని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏపీ గవర్నర్ గా నియమితులు కావడంతో ఏపీ విషయంలో బీజేపీ వ్యూహం ఏమిటి? వైఖరి ఏమిటి? ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో కేంద్రం పార్లమెంటు వేదికగా తన వైఖరి ప్రకటించడం, అలాగే  ఈ నెలాఖరులో సుప్రీం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కొత్త గవర్నర్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.