Publish Date:Jan 22, 2013
ప్రధానితో మీటింగ్ అనంతరం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్ తో సమావేశం అయ్యారు. ప్రధాని దగ్గర శ్రీకృష్ణకమిటీ నివేదిక గురించే ప్రస్తావించిన కాంగ్రెస్ నేతలు ఆజాద్ తో కూడా అదే విషయంపై మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలోని 6వ నిబంధన అమలు చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ను కోరారు. దీంతో తెలంగాణ వాదుల కన్నా సమైక్యవాదులు ఒక అడుగు ముందుకేసినట్టైంది.
ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేవలం షిండేతో మాత్రమే మీటింగేశారు. సీమాంధ్రనేతలు వరసపెట్టి నాయకులను కలుస్తూ బిజీగా మారారు. సీమాంధ్రకు చెందిన 20 మంది మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఆజాద్‌ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు కోరారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రం ఎందుకు కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామో ఆజాద్‌కు వివరించామని చెప్పారు. తమ అభిప్రాయాలు చెప్పామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తాము ఊహించలేమన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతం చేసే విషయం ఆజాద్ మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cabinet-in-delhi-on-tissue-43-20550.html
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
ఎన్నికల్లో గెలవాలనే ఆశ.. ప్రజల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల! కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
మోడీ ఫోన్ లో తుపానుల వల్ల సంభవించిన నష్టం వివరాలకు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానికి వివరించారు.
ఎన్నిక ఏదైనా, ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు ఆదరిస్తేనే విజయం అన్న తత్వం జగన్ కు బోధపడాలి. కానీ ఆయన జగన్ కదా? అందుకే 2024 ఓటమి సందర్భంగా ఏ ఆరోపణలు చేశారో, 2026 మునిసిపోల్స్ లో పరాజయంపై కూడా అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అశ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై లక్షా 35 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు. ఎన్నిక ఫలితం వెలువడిన రోజే ఆయన జన్మదినం కూడా కావడం విశేషం. వంగవీటి రాధా విజయాన్ని తెలుగుదేశం కూటమి శ్రేణులు, వంగవీటి రాధా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు.
న్నికల్లో విజయంపై ధీమాతో బరిలోకి దిగినప్పటికీ, ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏబీవీ ఇసుమంతైనా ప్రభావం చూపలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం ఆ పార్టీకి ఇదే తొలిసారి. మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై ఘన విజయం సాధించారు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా.. తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Narsipatnam Municipality, Chinthakayala Padmavathi, AP Municipal Elections, NDA Alliance Victory, Ayyannapatrudu, AP municipal elections, YSRCP, Telugu News, Telugu One