Publish Date:Jun 11, 2012
రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం గడువు పూర్తయింది. దీంతో ఎన్నికల్లోపు అన్ని పార్టీలూ అక్రమ మార్గాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దానికి కూడా రెండు రోజులే గడువు ఉండటంతో ప్రతీ అభ్యర్థి ముందుగానే సిద్ధం చేసుకున్న కార్యక్రమాల్లో మునిగిపోయారు. మద్యం అమ్మకాలకు ఎన్నికలు జరిగే ప్రతీ జిల్లాలోనూ డ్రైడే ప్రకటించారు. ఈ డ్రైడే గురించి ముందుగానే తెలయటంతో అభ్యర్థులు మూడు రోజుల ముందే మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు అందుబాటలో సెంటర్లు ఏర్పాటు చేశారు. తనిఖీకి దొరక్కుండా ముందుగా అటకల పైనా, పాన్ షాపుల్లో కూల్ డ్రింక్ ల మధ్యలోనూ మద్యం దాచేశారు. దాన్ని తీసి రాత్రి ఎనిమిది గంటలు దాటినది మొదలు పంపిణీ ప్రారంభించారు.
తెల్లవారుజాము వరకూ మందు లేదనకుండా పంపిణీ చేసేందుకూ ప్రధానపార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఎక్సయిజ్ శాఖ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లోనూ డ్రైడే పాటిస్తోంది. దీంతో మద్యం దుకాణాలన్నీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం దాకా వీటిని తెరవబోమని ఎక్సయిజ్ సిబ్బందే స్వయంగా తాగుబోతులకు చెప్పి పంపించారు. ఎక్సయిజ్ సిబ్బంది ఉన్నంత వరకూ నిబంధనల ప్రకారం నడుచుకున్న మద్యం దుకాణదారులు వారు అలా బయటకు వెళ్లగానే దొంగచాటు అమ్మకాలకు తెరలేపారు. అలానే మద్యం తరువాత డబ్బు పంపిణీ కూడా ప్రారంభమైంది. వీధికి ఒకరికి బాధ్యతలు అప్పగించారు. వారు కూడా మహిళల ద్వారా డబ్బులు అన్ని కుటుంబాలకు ఓట్ల లెక్క ప్రకారం డబ్బు చేరవేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-bypolls-2012-24-14790.html
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!