పదవి ఫసక్?.. సోము వీర్రాజుకు హైకమాండ్ పిలుపు.. 

Publish Date:Dec 14, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆ పదవి మరికొంత కాలమే అని తెలుస్తోంది. సోము వీర్రాజును ఢిల్లీకి రావాలని హైకమాండ్ పిలవడంతో ఆయన హడావుడిగా హస్తిన వెళ్లారు. దీంతో ఆయను  ఊస్టింగ్ ఖాయమనే చర్చ బీజేపీలోనే జరుగుతోంది. సోము వీర్రాజు తీరుపై గుర్రుగా ఉన్న బీజేపీ పెద్దలు... అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని దాదాపుగా డిసైడైపోయారని చెబుతున్నారు.

ఇటీవలే తిరుపతికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పార్టీ పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. అయితే అమిత్ షా వార్నింగ్ ఇచ్చి వెళ్లినా ఏపీ బీజేపీ పనితీరు మారకపోవడంతో సారధిని మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సోము వీర్రాజును తక్షణం ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందని అంటున్నారు.

ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ హైకమాండ్. అందులో భాగంగానే సోముకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే సోము వీర్రాజు మాత్రం ఏపీలో అధికారంలో ఉన్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే... ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నా ఏనాడు మాట్లాడలేదు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. తీవ్రంగా స్పందించలేదు. అంతేకాదు అధికార పార్టీపై ఏదో చేయాలన్నట్లుగా కొన్ని విమర్శలు చేస్తూ... చంద్రబాబునే టార్గెట్ చేశారు. సోము వీర్రాజు తీరుపై సొంత పార్టీ నేతలే చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.  దీంతో ఎంతసేపు మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో హడావుడి చేయటమే తప్పించి క్షేత్రస్ధాయిలో వీర్రాజు బలమైన నేతకాదని హైకమాండ్ గుర్తించిందని అంటున్నారు. 

వైసీపీ ప్రభుత్వంపై ఎందుకు పోరాడలేకపోతున్నారన్న పద్దతిలో ఆయనపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారాలు కట్ చేశారు. కోర్ కమిటీని నియమించారు. అయితే అసలు నాయకత్వమే సైలెంట్‌గా ఉంటూండటంతో కోర్ కమిటీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఆయనపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తేలడంతోనే ఇటీవల ఆయన … ఇక రాజకీయాల్లో ఉండననే ప్రకటనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024 తర్వతా రాజకీయ రిటైర్మెంట్ అని ఆయన ప్రకటించుకోవడం.. పార్టీ హైకమాండ్‌కు ఇప్పుడు తనను పదవి నుంచి తొలగించవద్దని సంకేతాలు పంపడమేనని అంటున్నారు. 

అయితే సోము వీర్రాజు పార్టీ కోసం ఏం చేశారన్న నివేదిక రెడీ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది ఒక్కటంటే ఒక్కటీ కనిపించడం లేదన్న అభిప్రాయం ఢిల్లీ నేతల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్తున్న సమయంలో కన్నా లక్ష్మినారాయణను తొలగించి సోము వీర్రాజుకు చాన్సిచ్చారు. కానీ పూర్తిగా వైసీపీ అనుబంధంగా మార్చేశారు. అమరావతిపై మాట్లాడిన వారిని సస్పెండ్ చేసి .. పార్టీలో చేరిన కొంత మంది నేతలను వైసీపీ తరహాలో కోవర్టులుగా చూస్తూ పార్టీని కోలుకోకుండా చేశారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. అందుకే ఆయనకు ఫైనల్ క్లాస్ పీకడానికో.., పదవి నుంచి తప్పిస్తున్నామని చెప్పడానికో ఢిల్లీ పిలిపించారని భావిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.