అయ్యయ్యో.. కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం..
Publish Date:Dec 23, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కింద పడిపోయారు. ఆయన బొక్కా బొర్లా పడ్డారు. అయితే ఆయన కాలు జారో, ప్రమాదానికి గురై కింద పడి పోలేదు.. కబడ్డీ ఆడుతూ ఆయన కింద పడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగింది. ఆముదాలవలసలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను అసెంబ్లీ స్పీక్ర తమ్మినేని ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా ఆటగాడిలా మారిపోయారు. ఒక టీమ్ తరపున కూతకు వెళ్లారు. ఉత్సాహంగా ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి కాలు జారి కిందపడిపోయారు. దీంతో వెంటనే ఉండే సెక్యూరిటీ గార్డులు ఆయనను పైకి లేపారు. అయితే కింద పడిపోయినా స్పీకర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-assembly-speaker-tammineni-seetha-ram-fell-down-in-kabaddi-39-128957.html
http://www.teluguone.com/news/content/ap-assembly-speaker-tammineni-seetha-ram-fell-down-in-kabaddi-39-128957.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





