Publish Date:Oct 11, 2019
కార్మిక బీమా వైద్య సేవల సంస్థ ఈ.ఎస్.ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మొత్తం రెండు వందల కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అంచనా వేస్తున్న ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకూ పదమూడు మంది నిందితులను అరెస్టు చేసిన అధికారులు తరువాత ఏడుగురు నిందితులను రెండ్రోజుల పాటు తమ కస్టడీ లోకి తీసుకోనున్నారు. ఈ.ఎస్.ఐ ఐ.ఎం.ఎస్ విభాగంలో మందుల కుంభకోణం కేసులో ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది.
ఈ కేసులో పదమూడు మందిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు దేవికారాణి, పద్మ, రాధికతో పాటు మరో నలుగురిని బుధవారం నుంచి రెండు రోజుల పాటు కోర్టు అనుమతితో ఏసీబీ కస్టడీ లోకి తీసుకోనుంది. ప్రస్తుతం వీరంతా చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. దేవికారాణితో పాటు మిగతా ఆరుగురిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించటం వల్ల కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించారని అధికారులు భావిస్తున్నారు. కోట్ల రూపాయల అక్రమాల్లో ఎవరెవరి వాటా ఎంత, ఫార్మా సంస్థల ప్రతినిధులతో ఏ విధంగా కుమ్మక్కయ్యారు అనే అంశాలు తేల్చే పనిలో ఏసీబీ అధికారులున్నారు.
దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు భావిస్తున్న విచారణ బృందం ఇందుకు ఎవరెవరు సహకరించారనే ఆధారాలు సేకరిస్తున్నారు. అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేయడం, నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించటం డిస్పెన్సరీ లకు చేరాల్సిన రోగ నిర్ధారణ పరీక్షల కిట్ లను ప్రైవేటు వ్యక్తులకు చేరవేసి బహిరంగ మార్కెట్ లో విక్రయించడం వంటి మోసాలకు ఈ.ఎస్.ఐ ఆధికారులు ఫార్మా సంస్థలతో కలిసి పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు.
ఆయా అంశాలపై నిందితులను పూర్తి స్థాయిలో విచారించేందుకు రంగం సిద్ధమైంది. నిందితుల కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టిన తర్వాత మరి కొంత మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి ఫార్మసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ ఆఫీస్ ఉద్యోగి పాషాను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-three-members-arrested-in-esi-scam-25-89970.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.