జగన్ సర్కార్ కు మరో పరాభవం.. ఆర్5 జోన్ లో ఆగిన ఇళ్ల నిర్మాణం

Publish Date:Aug 3, 2023

Advertisement

కింద పడినా పై చేయి నాదే  అంటూ జగన్ సర్కార్ ఎంతగా మొండికేసినా ముందడుగు వేసే అవకాశాలు లేకుండా కోర్టు తీర్పులు గట్టి బంధనాలనే వేశాయి. ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణం విషయంలో తీర్పులకు వక్రభాష్యం చెప్పి మరీ తొడగొట్టి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామంటూ ఘనంగా ప్రకటించుకుని.. సాక్షాత్తూ సీఎం జగనే శంకుస్థాపన చేసినా.. అక్కడ ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. హైకోర్టు ఆర్5  జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది.  

అక్కడ ఇళ్ల నిర్మాణాన్నితక్షణమే నిలిపివేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. గత  తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూమిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చట్ట విరుద్ధమన్న అంశంపై  కేసులు ఉన్నాయి. అన్నిటికీ మించి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనే లేదు. అంటే అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. హైకోర్టు తీర్పులో ఈ విషయం విస్పష్టంగా ఉన్నా జగన్ సర్కార్ సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసి మరీ  ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసింది. పేదల పేరుతో ఎక్కడెక్కడో ఉన్న ఓటు బ్యాంక్‌కు సెంటు స్థలాలు పంపిణీ చేసి శంకుస్థాపన కూడా చేసేసింది.

అయితే జగన్ సర్కార్ చెబుతున్నట్లుగా  కాకుండా సుప్రీంకోర్టు  ఇంటి స్థలాలు పంపిణీ చేయవచ్చు కానీ లబ్ధిదారులకు చట్టబద్దమైన అధికారం దఖలు పడదని.. తుది తీర్పుకు లోబడే ఆ హక్కు దఖలు పడేదీ లేనిదీ ఆధారపడి ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.  ఆ మేరకు ఇళ్ల పట్టాలపై స్పష్టంగా పేర్కొన్న మిదటే వాటిని పింపిణీ చేయాలని ఆదేశించింది. అయితే జగన్ సర్కార్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన పట్టాలపై కేవలం స్టిక్కర్లు అంటించింది.  ఆర్ 5 జోన్‌లో ఉన్న భూమిపై ధర్డ్ పార్టీకి భూమిహక్కులు బదలీ అవ్వవు. కోర్టు తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నా జగన్ సర్కార్ మాత్రం పేదలకు  భూమి పంపిణీ అంటూ కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే..  పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసేసింది.

జగన్ సర్కార్ అధికారంలో ఉన్న నాలుగేళ్ల పైచిలుకు సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడా   ఇళ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకే రంగులు వేసి హడావుడి చేయడానికి ప్రయత్నించి బొక్కబోర్లా  పడింది. అయితే అమరావతి విషయంలో మాత్రం ఇళ్ల నిర్మాణానికి  ఎక్కడ లేని హడావుడీ ప్రదర్శిస్తోంది. అయితే అమరావతిలో జగన్ సర్కార్ ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి  నిధులిచ్చేది  లేదని కేంద్రం తేల్చేసినా  జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరాయించి  ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. ఇప్పుడు సీఎం జగన్ ఆర్భాటంగా కోర్టు తీర్పులను ఉల్లంఘించి మరీ శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. వచ్చే డిసెంబర్ లో రాజధాని కేసులపై విచారణ జరుగుతుంది. అప్పటి వరకూ నిర్మాణాల ప్రారంభానికి వీలులేదు.  

పేదలకు ఇళ్లిద్దామంటే అడ్డుకున్నారని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది కానీ ఆర్5 జోన్ లో పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు కూడా తమకు అక్కడ ఇళ్ల నిర్మాణం ఎందుకు   తామున్న చోట ఇవ్వొచ్చు కదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలా ఉండగా ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై హై కోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.