అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా

Publish Date:Jun 17, 2026

Advertisement

తమిళనాట అన్నాడీఎంకే పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతోంది. తాజాగా   ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తమిళనాడు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  తన రాజీనామాను ఆయన  శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.  విరాలిమలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయభాస్కర్ రాజీనామాతో దీంతో అన్నాడీఎంకే లో తీవ్ర కలకలం మొదలైంది.

ఈ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ అగ్ర నాయకత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి  వైఖరి పట్ల విజయభాస్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని నిజమైన, క్షేత్రస్థాయి కార్యకర్తల గళాన్ని, అభిప్రాయాలను అధిష్టానం కనీసం వినడం లేదంటూ ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం   ప్రభుత్వంపై జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో విజయభాస్కర్ పార్టీ లైన్‌ను ధిక్కరించి, ప్రభుత్వానికి అనుకూలంగా  ఓటు వేయడం గమనార్హం. నాటి నుంచే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే తన తదుపరి  కార్యాచరణను ప్రకటిస్తానని విజయభాస్కర్  తెలిపారు.

  2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం..  కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే అన్నాడీఎంకే పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఐదో శాసనసభ్యుడిగా విజయభాస్కర్ నిలిచారు. ఈ వరుస వలసల కారణంగా 234 మంది మొత్తం సభ్యులున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకే పా బలం ఇప్పుడు   42కు పడిపోయింది.  మరోవైపు, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటుతో కలుపుకుని, ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఖాళీల సంఖ్య 6 కి చేరుకుంది.

ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే, గతంలో అన్నాడీఎంకేను వీడి బయటకు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల బాటలోనే డాక్టర్ సి. విజయభాస్కర్ కూడా అధికార టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.