విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. అదృష్టవశాత్తు తప్పిన ముప్పు

Publish Date:Jun 11, 2026

Advertisement

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో  మరో ప్రమాదం జరిగింది. సరిగ్గా మూడు రోజుల క్రితం జరిగిన భారీ ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదం  మరువక ముందే.. గురువారం (జూన్ 11) తెల్లవారుజామున  ప్లాంట్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్‌ఎమ్‌ఎస్-1 విభాగంలోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ వద్ద లాడిల్ నుండి ద్రవ ఉక్కు ఒక్కసారిగా లీకైంది. అయితే.. ఈ లీకేజీ జరిగిన సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో    ప్రాణ నష్టం తప్పింది.

అయితే స్టీల్ ప్లాంట్ లో వరుస ప్రమాదాలు జరుగుతుడటం పట్ల కార్మికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కాగా ఈ తెల్లవారు జామున జరిగిన లీకేజీ ఘటనలో ఎటువంటి నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.
సొంత సర్వేతోనే జగన్‌కు షాక్?.. ‘మావిగన్’ వ్యూహంపై పార్టీలో అసంతృప్తి..?
తెలంగాణ అప్పులపై చర్చకు సిద్దమని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం, హత్య ఉదంతం కేసులో దర్యాప్తు సంస్థలకు అత్యంత కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి.
అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌కు అండగా నిలిచే ఇస్లామిక్ మిత్రదేశమే ఈ విధంగా పాక్ బయాయిలను ముక్కుపిండి మరీ వసూలు చేయడానికి సిద్ధం కావడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. అప్పులు తీసుకోవడం, వాటిని సకాలంలో తీర్చకుండా కాలయాపన చేయడం పాకిస్థాన్ కు మామూలే. అయితే ఈ సారి మాతరం యూఏఈ కాలయాపనను ఇసుమంతైనా సహించేది లేదని అల్టిమేటం ఇవ్వడంతో పాకిస్థాన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ.. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ధీరజ్ సేథ్ తండ్రి భారత సైన్యంలో త్రీస్టార్ జనరల్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు. ఆయన కుమారుడు ఆయన కంటే ఉన్నత స్థాయికి చేరుకుని ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.