మరో వైసీపీ వికెట్ డౌన్?.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం?

Publish Date:Aug 28, 2026

Advertisement

 

వైసీపీలో  ఆ పార్టీ అధినేత జగన్ కు  సన్నిహితుడిగా  గుర్తింపు పొందిన నెల్లూరు ఫైర్‌బ్రాండ్ లీడర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  

తాను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచే అవకాశాలు లేవనీ,  తన రాజకీయ ప్రయాణం అకాలంగా లేదా త్వరలోనే ముగిసిపోయినా  తనకు ఎలాంటి రిగ్రెట్ ఉండదనీ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. నెల్లూరు రాజకీయంలో తనకంటూ ఒక శాశ్వత ముద్ర పడిందన్న అనిల్ కుమార్ యాదవ్.., తన రాజకీయ వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ఆయన అన్న'తన పొలిటికల్ కెరీర్ కు ప్రీమెచ్యూర్ ఎండ్ అన్న వ్యాఖ్యలు పొలిటికల్ రిటైర్మెంట్ నే సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు  విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్..  జగన్ కేబినెట్‌లో రెండేళ్ల పాటు మంత్రిగా  ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్‌కు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో  జగన్ చేపట్టిన టిక్కెట్ల మార్పుల ప్రక్రియలో భాగంగా,   నెల్లూరు నుంచి తప్పించి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు.

ఈ మార్పు ఆయన రాజకీయ ప్రయాణంలో కోలుకోలేని దెబ్బ తీసింది. నరసరావుపేటలో ఘోర పరాజయాన్ని చవిచూసిన నాటి నుంచి అనిల్ రాజకీయాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నారు. గతంలో పార్టీకి సంబంధించి ప్రతి విషయంలోనూ ముందుండి మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ ఆ ఓటమి తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో వైసీపీలో కీలక పాత్ర పోషించిన పలువురు సీనియర్ నేతలలాగే.. అనిల్ కుమార్ యాదవ్ కూడా సైలెంటైపోయారు.  ఇప్పుడు ఏకంగా రాజకీయ సన్యాసం సంకేతాలు ఇచ్చారు. 

 

(Anil Kumar Yadav Political Retirement, YCP Leader, Former Minister, Nellore politics,  AP political updates, Telugu One)

By
en-us Political News

  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.