ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలేంటంటే?
Publish Date:Dec 10, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులలు అంశంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది. దీని ద్వారా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, దాదాపు 56 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇంకా పలు, సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇక పోతే.. 169 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న లోక్ భవన్ కు టెండర్లు పిలిచుందుకు, జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు పాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు నిధుల కేటాయింపునకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి.
http://www.teluguone.com/news/content/andhrapradesh-cabinet-meeting-39-210811.html





