తాడిపత్రికి పెద్దారెడ్డి.. జేసీ మాస్ వార్నింగ్

Publish Date:May 4, 2025

Advertisement

 

 

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ పట్టణంలో అడుగుపెట్టబోతున్నారు. పోలీసు ఆంక్షలను సవాలు చేస్తూ కేతిరెడ్డి కోర్టు అనుమతితో మరో రెండు రోజుల్లో తాడిపత్రి రాబోతున్నారు. అయితే ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు కూడా సిద్ధమవ్వడం, తాడిపత్రికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు ... దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అని పట్టణ  వాసులు టెన్షన్ పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రి కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్రమంతా రాజకీయం ప్రశాంతంగా ఉంటే  ఒక్క తాడిపత్రి లో మాత్రం ఎప్పుడు పొలిటికల్ హీట్ రగులుతూనే ఉంటుంది.


 తాడిపత్రిలో మాజీ  ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల వైరం ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఎప్పుడూ టెన్షన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. గత 30 ఏళ్లుగా తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే ఆధిపత్యం. జేసీ కుటుంబంలో పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్న వారే గెలుస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటినుంచి ఈ ఆధిపత్య పోరు మరింత ఎక్కువయింది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తుతూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి పోలీసుల సహాయంతో  జేసీ ప్రభాకరరెడ్డిని ఇంటి బయటకు కూడా రానివ్వకుండా అనేకమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏక్కడ ఏ ధర్నా కార్యక్రమం, ఏ ఆందోళన చేసే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలో కూర్చుని ఆ కుటుంబానికి సవాల్ విసిరారు. 

ఇక అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్యపోరు మరింత పీక్స్ కు చేరింది.సీన్ కట్ చేస్తే ఇప్పుడు జేసీ వంతు . 2024 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కలు కనపడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి అనంతరం తాడిపత్రి కి దూరమైన పెద్దారెడ్డి ఇంతవరకు ఆయన సొంత ఇంటి మొహమే చూడలేదు. 2024 ఎన్నికల సమయంలో చెలరేగిన హింస వల్ల తాడిపత్రిలోని కీలక నేతలందరినీ పట్టణానికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటూ  కాలం గడపాల్సి వచ్చింది. కానీ కోర్టు ఆదేశాలతో ఇటీవల నేతలు ఒక్కొక్కరిగా తాడిపత్రికి చేరుకుంటున్నారు. పెద్దారెడ్డి మాత్రం ఇప్పటివరకు తాడిపత్రిలోని తన సొంత ఇంటి మొహం చూడలేకపోయారు. మధ్యలో ఒకసారి ఏదో పేపర్స్ కోసమని తాడిపత్రి కి వెళ్లే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో పోలీసులు అప్పటినుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ఎంట్రీ లేకుండా చేశారు. ఆ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు ఉత్తర్వులు  తెచ్చుకున్నారు. 

రెండుమూడు  రోజుల్లో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ పెద్దారెడ్డి రాకను జేసీ ప్రభాకరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై పబ్లిక్ గానే పెద్దారెడ్డిని తాడపత్రిలోకి రానివ్వనని జేసీ స్టేట్మెంట్ ఇవ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో పెద్దారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న గ్రౌండ్ వద్ద పెద్ద సంఖ్యలో రాళ్ల కుప్పలు దర్శనమివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయి ఆ రాళ్ల కుప్పలను తొలగించారు. ఇక తాడిపత్రి వెళ్ళే విషయంలో పెద్దారెడ్డి కూడా గట్టిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నారు. జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలను చూపించి పోలీస్ బందోబస్తుతో వెళ్లాలని అనుకుంటున్నారు.. అయితే జేసీ వార్నింగ్ నేపథ్యంలో పోలీసులు కేతిరెడ్డికి పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠభరితంగా మారింది.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.