అమెరికా వ్యూహాత్మక జూదం.. మునీర్ మధ్యవర్తిత్వం!

Publish Date:Apr 20, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా అవతరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం మునీర్‌ను రెండు దేశాల మధ్య ఒక దౌత్య వంతెనగా (డిప్లమాటిక్ బ్రిడ్జి) భావిస్తున్నప్పటికీ..  ఇది అమెరికా జాతీయ భద్రతకు ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై నిపుణుల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    దౌత్యం కంటే.. నష్టనివారణ అంటే డ్యామేజ్ కంట్రోల్ వైపే మొగ్గు చూపుతున్న ట్రంప్ శైలి.. వాషింగ్టన్‌లోని భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. మునీర్ ప్రస్తుతం కేవలం పాకిస్థాన్ సైనిక వ్యవహారాలకే పరిమితం కాకుండా.. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 
అయితే..  ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా..  అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు   అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా  హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే..  పాకిస్థాన్ విషయంలో అమెరికా నమ్మకం పలుమార్లు వమ్ము అయింది.  ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తాలిబాన్‌లకు మద్దతు ఇస్తూనే..  అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందిన గత రికార్డులను భద్రతా నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు వైపులా చక్రం తిప్పే పాక్ వ్యూహం వల్ల వాషింగ్టన్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పుడు మునీర్‌పై అతిగా ఆధారపడటం అనేది ఒక రకమైన  జియోపాలిటికల్ జూదం  (జియోపాలిటికల్ గ్యాంబిల్)గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం గమనార్హం. దీనికి భద్రతా కారణాలు సాకుగా చూపుతున్నా..  తెరవెనుక నెలకొన్న అనిశ్చితి, మునీర్ నెట్‌వర్క్‌పై   అపనమ్మకమే   కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సాంప్రదాయ దౌత్య మార్గాలను కాదని, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి వ్యక్తిగత సన్నిహితుల ద్వారా ట్రంప్ ఈ వ్యవహారాన్ని నడిపించడం చర్చలకు ఇసుమంతైనా పారదర్శకత లేదనే అనుమానాలను  బలపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార శైలికి తగ్గట్టుగా  డీల్ ఫస్ట్ అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన దృష్టిలో మునీర్ ఒక  ఉపయోగకరమైన  వ్యక్తిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయనను తన  ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్  గా మునీర్ ను అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అయితే అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం మీద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు,  పారదర్శకత మీద నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునీర్ విషయంలో పారదర్శకత సందేహాస్పదంమే. .మధ్యవర్తులను నియమించుకోవడం సులభమే కానీ, వారిని నియంత్రించడం చాలా కష్టం అంటారు. పాకిస్థాన్ గతం,  మునీర్‌కు ఉన్న ఇతర దేశాల సంబంధాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచేవిగానే ఉన్నాయి. 

శాంతి ఒప్పందాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలే రేపు భద్రతా లోపాలుగా మారితే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.    ప్రస్తుతానికి మునీర్‌ను ఎంతగా నమ్మినా, అప్రమత్తత అవసరమని అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేస్తోంది. చివరిగా అమెరికాకు ఇప్పుడు కావాల్సింది కేవలం మధ్యవర్తులు కాదు, ఒక పటిష్టమైన, అదే సమయంలో విశ్వసనీయ విదేశాంగ విధానం. వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి చేసే దౌత్యం తాత్కాలికంగా ఫలితాలను ఇచ్చినా..  దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మరి మునీర్ అనే ఈ దౌత్య వంతెన అమెరికాను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేరుస్తుందో లేక కొత్త సమస్యల్లోకి నెడుతుందో వేచి చూడాలి.

-సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.