ఇరాన్ తో యుద్ధం కోసం అమెరికా చేసిన ఖర్చెంతో తెలిస్తే మైండ్ బ్లాక్ ఖాయం.!

Publish Date:Jul 21, 2026

Advertisement

ఇరాన్‌తో  అమెరికా చేస్తున్న  యుద్ధం మిడిల్ ఈస్ట్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధంతో అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ యుద్ధం కోసం, యుద్ధాన్ని కొనసాగించడం కోసం అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలుస్తే మైండ్ బ్లాక్ కావడం ఖయం.  ప్రపంచానికి పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా ఇరాన్ సంబంధిత సైనిక చర్యల కోసం అక్షరాలా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో  3.6 లక్షల కోట్లు.  పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో నిరంతరం సాగుతున్న రాకెట్లు, డ్రోన్లు, క్షిపణి దాడులు అమెరికా ఖజానాను దాదాపుగా ఖాళీ చేస్తున్నాయి. అలాగే అమెరికా రక్షణ రంగాన్ని ఈ యుద్ధం డిఫెన్స్ లో పడేసింది. అమెరికా అహంకారంలోని డొల్ల తనాన్ని ఈ యుద్ధం ప్రపంచానికి చాటింది. 

  అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ సెనేట్ అప్రాప్రియేషన్స్ కమిటీ ఎదుట స్వయంగా హాజరై ఇరాన్ తో యుద్ధం కోసం ఎంత వ్యయం చేయాల్సి వచ్చిందో గణాంకాలతో సహా వెల్లడించారు. సెప్టెంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఈ యుద్ధ వ్యయం ఇంకా భారీగా పెరుగుతుందని కూడా ఆయన అప్రాప్రియేషన్స్ కమిటీ  ఎదుట అంగీకరించారు. మే, జూన్ నెలల్లో వేసిన అంచనాల ప్రకారం ఈ వ్యయం 29 బిలియన్ల నుంచి 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందని భావించినా.. అది వాస్తవంగా 37.5 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.   యుద్ధ తీవ్రత, క్షిపణుల వాడకం అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. 

రక్షణ అవసరాలు, ఆయుధ రీప్లేస్‌మెంట్ కోసం అత్యవసరంగా మరో  67 బిలియన్ డాలర్ల అదనపు రక్షణ నిధులను కేటాయించాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్‌తో కలిసి పీట్ హెగ్‌సెత్ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తరఫున సెనేట్‌ను అభ్యర్థించారు. సైనిక బలగాల సంసిద్ధతను కాపాడుకోవడానికి   నిధులు అత్యవసరమన్నారు.  నిధులు వెంటనే మంజూరు కాకపోతే, అమెరికా సైనిక శిక్షణా కార్యక్రమాలను పరిమితం చేయాల్సి వస్తుందనీ, ఇంు వల్ల   నిర్వహణ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.   

Pete Hegseth US Iran war, US military spending Iran, Strait of Hormuz conflict, Pentagon defense budget 

By
en-us Political News

  
గత 24 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను హర్యానా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్ వాంగ్చుక్ ను మేందాంత ఆస్పత్రికి తరలించారు.
లేఆఫ్‌ల భయాల నడుమ యూరోపియన్ టెక్ దిగ్గజం ASML తమ ఉద్యోగులకు రూ. 19 లక్షల బోనస్ ప్రకటించింది. 2027 నుండి 2030 వరకు కంపెనీలో కొనసాగే ప్రతిభావంతులకు ఈ ప్రత్యేక షేర్లను అందించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బిట్‌కాయిన్ మైనింగ్‌లో $500M రెవెన్యూ సాధించిన మేసన్ జప్పా Blockware Solutions సక్సెస్ స్టోరీ! 10 ఏళ్ల కంపెనీ బిల్డింగ్ పాఠాలు, లీడర్‌షిప్ టిప్స్ మరియు బిట్‌కాయిన్ మైనింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత్ బాంగ్లాదేశ్ మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌పై బాంగ్లాదేశ్ క్రీడా మంత్రి అమీనుల్ హక్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడా దౌత్యం ద్వారా ఉద్రిక్తతలు అధిగమించి సెప్టెంబర్‌లో భారత జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
2026 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు ఫిఫా అనుకూలంగా వ్యవహరించిందన్న వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను క్రిస్టియానో రొనాల్డో లైక్ చేశారా? వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ వెనుక ఉన్న అసలు నిజాలు, ఫ్యాక్ట్ చెక్ వివరాలు ఇక్కడ చూడండి.
టీమిండియా యువ ఆటగాడు, టీ20 వైస్ కెప్టెన్ అయిన తిలక్ వర్మ.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌పై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. జింబాబ్వే సిరీస్‌కు ముందు తన ఆటతీరు వెనుక ఉన్న అసలు కారణాలను, మ్యాచ్‌ల్లో ఎదురైన పరిస్థితులను ఈ వెబ్ స్టోరీలో స్పష్టంగా వివరించాడు.
రాజధాని పరిధిలో కీ రవాణా వ్యవస్థకు సీడ్ యాక్సెస్ రోడ్డు వెన్నెముక వంటిదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఈ కీలక రహదారి నిర్మాణం నిలిచిపోయిందని, దీనివల్ల రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు జాప్యమౌతోందని పేర్కొన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే మధ్యంతర స్టే ఎత్తివేయాలని కోరారు.
నిరసనలో పదివేల మంది వరకు నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి.
డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటన మేరకు వచ్చే నెల 1 నుండి రెండేళ్ల పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ ఔషధాలపై సుంకం సున్నా శాతంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధి ముగిసిన వెంటనే, మొదటి ఏడాదిలోనే దిగుమతి సుంకాలను 100 శాతానికి పెంచుతారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ సుంకాన్ని 200 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.