ఢిల్లీ పోలీసుల వ్యూహ వైఫల్యం.!
Publish Date:Jul 21, 2026
Advertisement
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ పిలుపు మేరకు జరిగిన పిలుపునిచ్చిన చలో పార్లమెంటు ఆందోళన హస్తినలో ఉద్రిక్తతలకు దారితీసింది. వేలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వైపు దూసుకురావడం, శాంతియుతంగా సాగుతుందనుకున్న ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంలో పోలీసుల వ్యూహ వైఫల్యం ప్రస్ఫుటంగా బయటపడింది. హస్తినలో కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలో ఉద్రిక్తత ఏర్పడడానికి కారణం పరిస్థితిని అంచనా వేయడంలో పోలీసులు ఘోరంగా విఫలం కావడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత మూడు వారాలుగా చలో సంసద్ కార్యక్రమంపై కాక్రోచ్ జనతాపార్టీ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా వరుస ప్రకటనలు ఇస్తూనే ఉంది. ఈ నిరసనలో పదివేల మంది వరకు నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి. ఈ స్థాయిలో జనం తరలిరావడానికి కాక్రోచ్ జనతా పార్టీ ముందు నుంచీ చేసుకున్న డిజిటల్ సమన్వయమే కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు, మహిళలు, యువకులు ఢిల్లీకి చేరుకోవడానికి వాట్సాప్ గ్రూపుల ద్వారా పక్కాగా కమ్యూనికేట్ చేసుకున్నారు. ఈ సమన్వయాన్ని చివరి నిమిషం వరకు నిఘా వర్గాలు పసిగట్టలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమైంది. ఆందోళనకారులు చిన్న చిన్న బృందాలుగా వచ్చి ఒక్కసారిగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయిందని భావించిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీనికి ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాఠీఛార్జ్, రాళ్ల దాడులతో పార్లమెంట్ పరిసర ప్రాంతాలు రణ క్షేత్రాన్ని తలపించాయి. గతంలో ఎంతో సున్నితమైన నిర్భయ ఘటన సమయం లోనూ, సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమాల సమయంలోనూ లక్షలాది మంది ప్రదర్శకులను అత్యంత సమర్థవంతంగా నిలువరించిన చరిత్ర ఢిల్లీ పోలీసులకు ఉంది. అలాంటి బలమైన పోలీస్ యంత్రాంగం ఈసారి నిరసనకారులను ఏ దశలోనూ కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడం విస్మయం గొలుపుతోంది. Chalo Parliament protest, NEET paper leak protest Delhi, Cockroach Janata Party protest, Parliament gate tension, Delhi protest lathi charge
http://www.teluguone.com/news/content/---delhi-police-intelligence-failure-36-226685.html





