కడపను తాకిన కోస్తా కోడి కత్తి...కొక్కరోకో అంటున్న కోడిపందాలు
Publish Date:Jan 15, 2026
Advertisement
కోడిపందేలు అంటే కోస్తా గుర్తుకొస్తుంది. పందెం రాయుళ్ళు తెలుగు రాష్ట్రాలనుంచి అక్కడికి చేరుకొని సంక్రాంతి కోడిపందేలతో జోష్ మీద ఉంటారు...ఈ సారి కోస్తా కోడి కత్తి కడపకు చేరింది. భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి. లక్షలకు లక్షల పందేలు తో సంక్రాంతి రోజున కోళ్ళ పందేలు జోరుగా జరిగాయి. కోడిపందేలు ఆడకుండా చర్యులు తీసుకోవాలని కోర్టులు చెప్పినా , కోడిపందాలు ఉండకూడదన్న నిభంధనలున్నా పలుచోట్ల మాత్రం కోడి కత్తులు ఆడాయి.ఈ ప్రాంతంలో సుశిక్షితులైన పందె ఆర్గనైజర్ లు లేక పోవడంతో కొందరు కోస్తా నుంచి ఆర్గనైజర్ లను రప్పించి నట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడిపందాలు ఆడించడం ,పందెం రాయుళ్లు, వాటి తిలకించేందుకు వచ్చే వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జిల్లాలో ఆసక్తికరంగా మారింది *నేతలే అండగా ! ఉమ్మడి కడప జిల్లాలో యధేచ్చగా కోడి పందేలు సాగాయి. అధికార నేతల అండతో ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి మరీ కోడి పందేలు నిర్వహించారు.పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో, పులివెందులలో కోడిపందాలు టిడిపి నేతలే ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.పులివెందుల నియోజక వర్గంలో వేంపల్లి, లింగాల మండలాల్లో కోడిపుంజులు కాలు దువ్వాయి. లింగాల మండలం దొండ్ల వాగులో భీమవరం నుంచి ఆర్గనైజర్లతో కోడి పందేలు ఆడించినట్లు సమాచారం. కొన్ని చోట్ల కోడి పందేలతో పాటు ఇతర ఆటలు ఆడించినట్లు గా తెలుస్తోంది.వేముల మండలం భూమయ పల్లె, పార్నపల్లి ,అలవలపాడు, పాములూరు, ఎర్రబెల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు జరిగాయి.రాజంపేట అత్తిరాల అమగంపల్లె, పుల్లంపేట ప్రాంతాల్లో జోరుగా కోడిపందాలు జరిగినట్లు సమాచారం. *ఆటగాళ్ళు కు సదుపాయాలు. ఆటగాళ్లకు సకల సదుపాయాలు కల్పించారు. ఒక్కో ఆట రెండు నుంచి ఐదు లక్షలు పలికినట్లు తెలుస్తోంది. తాడిపత్రి కదిరి తదితర ప్రాంతాల నుంచి పులివెందుల, రాజంపేట లకు పందెంకాసేవారు, జూదరులు రావడం జరిగింది..సంక్రాంతి ఆటవిడుపు గా అని చెబుతున్న నేతలు పండుగ సంబరాల మాటున కోస్తాకు దీటుగా భారీ మొత్తంలో కోడి పందేలు నిర్వహించడం కడప జిల్లాలో సంక్రాంతి కోస్తా కోడి పందేలను తలిపించింది. *పోలీసు ఆంక్షలను లెక్క పెట్టకుండా పోలీసు ఆంక్షలను లెక్క చేయని పందెం రాయుళ్లు యదేచ్చగా ఆటసాగించారు. కొన్ని చోట్ల కోళ్ల పందేలు ప్రత్యేక వీడియో షూట్ చేసి మరీ ఆడించడం జరిగింది. *పోలీసుల దాడులు కోస్తా బరుల కు తీసిపోని రీతిలో కోడి పందేలు జరగడంతో వీటిపై పోలీసులు దాడులు నిర్వహించారు.
కొండాపురం మండలం ఓబన్న పేట గ్రామ పొలాల్లో కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించి ఆరుగురు అరెస్టు చేశారు. టీ.కోడూరు కోడి పందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురు అరెస్టు చేశారు. మొత్తంగా జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో కోడిపందాలు జరగడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/kodi-pandelu-36-212555.html





