Publish Date:Jul 11, 2026
ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారం వైసీపీ తీరు రోజుకో రకంగా మారుతోంది. ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ ఎప్పుడు ఏం మాట్లాడుతోంది, ఏ క్షణంలో ఏ ప్రకటన చేస్తుందన్న విషయం ఆ పార్టీకైనా తెలుసా? అన్న అనుమానాలు పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి. ప్రశ్న రావణ్ కేసుపై స్పందించిన అంబటి రాంబాబు.. రావణుడే గెలుస్తాడు.. మేము గెలిపిస్తాం అంటూ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
వాస్తవానికి గత కొద్దిరోజులుగా ప్రశ్న రావణ్ ఎపిసోడ్లో వైసిపి సోషల్ మీడియా తీవ్ర అయోమయంలో పడినట్లు కనిపించింది. ఒక దశలో ప్రశ్న రావణ్ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పాత వీడియోలను షేర్ చేస్తూ, అతను టిడిపి సానుభూతిపరుడంటూ వైసిపి ప్రచారం చేసింది. ఇప్పుడు.. ఇప్పుడు మాట మార్చి ప్రశ్న రావణ్ ను వెనకేసుకొస్తూ వైసీపీ అగ్రనేతలు మాట్లాడుతున్నారు. ఒకరోజు టిడిపి మనిషి అని ముద్ర వేసి, ఆ మరుసటి రోజే అతనికి పూర్తి స్థాయిలో అండగా నిలబడటం విస్మయ పరుస్తోంది. పైగా మాజీ మంత్రి అంబటి ఒక అడుగు ముందుకు వేసి.. రావణుడిని గెలిపిస్తామనడం వివాదాస్పదంగా మారింది. ప్రశ్న రావణ్ భావజాలానికీ, వైసీపీ సిద్ధాంతాలకూ సంబంధం లేదన్న అంబటి.. అతని మీద అన్యాయంగా కేసులు పెట్టి సోషల్ మీడియా గొంతు నొక్కాలని,చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ యుద్ధంలో రావణుడే గెలుస్తాడు.. రావణుడిని మేము గెలిపిస్తామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత వారం ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. సమాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రావణుడిని గెలిపిస్తామనడమంటే.. తాము రాక్షసుడి పక్కన నిలబడినట్లు అంగీకరించడమే అవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద అంబటి రాంబాబు రావణుడిని గెలిపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నాయి.
Ambati Rambabu, Prashna Ravan, YCP Strategy, Prashna Ravan Arrest, AP Political News, Telugu YouTuber Arrest
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambati-support-ravana-39-225691.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.