Publish Date:Jan 31, 2026
వైసీపీ ఎకో సిస్టమ్ లోనే మర్యాదా, మన్నన వంటి వాటికి అవకాశం లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నానితో మొదలు పెడితే పలువురు నేతలు నిత్యం తమ బూతుల కారణంగానే వార్తలలో ఉండేవారంటే అతిశయోక్తి కాదు. సరే వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు.
కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు. వైసీపీ కార్యక్రమాలలో కూడా పెద్దగా కనిపించకుండా దాదాపు రహస్య జీవితం గడుపుతున్నారా అన్న అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు మాత్రం ఆ బూతు పురాణం విషయంలో అన్ని హద్దులూ దాటేశారు. సభ్య సమాజం సహించని భాషతో చంద్రబాబుపై రెచ్చిపోయారు. వివరాలలోకి వెడితే..
తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చేపట్టిన సిట్.. తాజాగా సుప్రీం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ చార్జిషీట్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టులో సిట్ దాఖలు చేసిన చార్జి షీట్ లో లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ స్పష్టం చేసిందంటూ నానా హడావుడీ చేస్తోంది. కల్తీ జరిగిందని సిట్ పేర్కొన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తూ జంతువుల కొవ్వు లేదని సిట్ పేర్కొందంటూ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లు అవాస్తవ ప్రచారం, ఆరోపణలు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆ క్రమంలోనే తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగేలా తెలుగుదేశం వ్యవహరిం చిందంటూ ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో పూజల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే శనివారం (జనవరి 31) గుంటూరు గురజాలలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఆ సందర్బంగా అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి సభ్య సమాజం సహించని రీతిలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించారు. అంబటి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambati-crossed-all-borders-39-213302.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది