అమెజాన్ ప్రైమ్ డే సేల్: గ్యాడ్జెట్స్‌పై 80% వరకు భారీ డిస్కౌంట్లు!
Publish Date:Jun 30, 2026
Advertisement
షాపింగ్ ప్రియులకు సరికొత్త పండగ వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో తన ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రవేశపెట్టి విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సరికొత్త ఆఫర్ల సునామీతో ముందుకు వస్తోంది. జూలై 4 నుంచి జూలై 6 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన "అమెజాన్ ప్రైమ్ డే డీల్స్" లైవ్ లోకి రానున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సరికొత్తగా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకునే వారికి కంపెనీ రూ.500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే సాధారణంగా రూ.1,499 ఉండే వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు కేవలం రూ.999 కే లభించనుంది. ప్రైమ్ మెంబర్స్‌కు మరో అద్భుతమైన సదుపాయం ఏమిటంటే, ఈ భారీ సేల్ డీల్స్ ప్రారంభం కావడానికి 72 గంటల ముందే వారు ప్రొడక్ట్స్‌ను యాక్సెస్ చేసి కొనుగోలు చేసే వీలుంటుంది. ఈసారి ప్రైమ్ డే సేల్‌లో దేశీయ మరియు అంతర్జాతీయ అగ్రశ్రేణి బ్రాండ్లకు చెందిన దాదాపు 500కు పైగా సరికొత్త ప్రొడక్ట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ సేల్‌లో కొనుగోలుదారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించారు. ఎస్బీఐ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపినా, లేదా ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకున్నా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. వీటికి అదనంగా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే ప్రైమ్ సభ్యులకు అపరిమితంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా దక్కనుంది. ఈ ఆఫర్ల ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ మరియు గృహోపకరణాలను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఈ సేల్‌లో మైండ్ బ్లోయింగ్ డీల్స్ వేచి ఉన్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫోన్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై ఏకంగా రూ.15,000 భారీ డిస్కౌంట్ లభించనుంది. దీనితో రూ.84,999 ఫోన్‌ను అత్యంత తక్కువ ధరలోనే కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. అలాగే మార్కెట్లో క్రేజ్ ఉన్న వన్‌ప్లస్ 13, ఐఫోన్ 17 సిరీస్‌లపై కూడా కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. సామ్ సంగ్ గెలాక్సి ఎం47, వన్‌ప్లస్ ఎన్6, వన్‌ప్లస్ నోర్డ్ 6, రెడ్మి ఏ7 ప్రొ 5జీ మరియు ఐక్యూ 15ఆర్ వంటి మొబైల్స్ పై భారీగా ధరలు తగ్గనున్నాయి. మొత్తంగా స్మార్ట్‌ఫోన్‌లు, వాటి యాక్సెస్సరీలపై 40 శాతం వరకు బంపర్ డిస్కౌంట్లతో పాటు తక్షణ బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర గ్యాడ్జెట్ల విభాగంలో ఆఫర్లు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. బోట్ రాకెర్జ్ 650 ప్రొ, రే బ్యాన్ మెటా వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్, వేరబుల్స్, హెడ్ ఫోన్లు మరియు వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 4 ప్రొ, శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రొలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. గోప్రొ హీరో 13 బ్లాక్ వంటి పాపులర్ కెమెరాలు, కెమెరా యాక్సెసరీలపై 75 శాతం వరకు, డెల్ 15 ల్యాప్‌టాప్‌లు మరియు టాబ్లెట్ల పై 40 శాతం వరకు, స్పీకర్లపై 60 శాతం వరకు ధరలు తగ్గనున్నాయి. ఇక స్మార్ట్ టీవీల విషయానికి వస్తే శామ్ సంగ్, సోనీ, టీసీఎల్, ఎల్జీ, గ్జియోమీ బ్రాండ్ టీవీలపై 65 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. దీనితో పాటు రూ.12,000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు, రూ.5,000 వరకు కూపన్ డిస్కౌంట్లు, 12 నెలల వరకు 'నో కాస్ట్ EMI' సదుపాయం కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇంటికి కావలసిన గృహోపకరణాల కొనుగోలుకు కూడా ఇదే సరైన సమయం. హియర్, శామ్ సంగ్, ఎల్జీ, గోద్రెజ్, డైకిన్ వంటి బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లపై 65 శాతం వరకు తగ్గింపు ఉంది. వీటిపై అదనంగా రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, రూ.17,000 వరకు ఇన్ స్టంట్ తగ్గింపు లభించనుంది. ఎల్జీ, శామ్ సంగ్, బోచ్, ఐఎఫ్బీ బ్రాండ్ వాషింగ్ మెషీన్లపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. వీటితో పాటు ఫ్యాషన్, బ్యూటీ విభాగంలో దుస్తులు, పాదరక్షలు, గడియారాలు, ఆభరణాలు మరియు లగేజీ ఉత్పత్తులపై ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన డీల్స్ లభించనున్నాయి. కాబట్టి ఈ జూలై 4 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను అస్సలు మిస్ అవ్వకండి.
http://www.teluguone.com/news/content/amazon-prime-day-deals-july-2026-36-224607.html





