కాంగ్రెస్ లో ఉండను.. బీజేపీలో చేరను! ప్రాంతీయ పార్టీ దిశగా పంజాబ్ మాజీ సీఎం.. 

Publish Date:Sep 30, 2021

Advertisement

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్ అమరీందర్ సింగ్  మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంటున్నానని, పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అదే సమయంలో తమ టిట్టర్ హేండిల్ నుంచి  కాంగ్రెస్ ను తొలిగించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో 52 ఏళ్ళపాటు సాగిన కెప్టెన్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది. అవును ఆయన కాంగ్రెస్ చేయి వదిలేస్తున్నారు. కానీ, చాలా మంది ఉహించిన విధంగా ఆయన కమలం గూటికి చేరడం లేదు. బీజేపీలోచేరడం లేదు. ఒక టీవీ చానల్ ప్రతినిధి, మీరు బీజేపీలో చేరుతున్నారా అని  అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెప్టెన్ సింగ్.. “నేను బీజేపీలో చేరడం లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నాను. ఆ పార్టీలో ఉండి అవమానాలు భరించలేను” అని స్పష్టం చేశారు. అయితే ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి ఊహాగానలకు వదిలేశారు. 

పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోతి సింగ్ సిద్దుకు సంబందించి అడిగిన ప్రశ్నకు, “సిద్దూకు  పీసీసీ చీఫ్’కు ఉండవలసిన స్థిరత్వం లేదు” అని  అన్నారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన నాయకత్వ సంక్షోభం గురించి అడిగిన ప్రశ్నకు, కెప్టెన్ అమరీందర్, “కాంగ్రెస్ పార్టీ పతనం వైపుగా పరుగులు తీస్తోంది” అని వ్యాఖ్యానించారు. అయితే కెప్టెన్ అమరిందర్ సింగ్, బీజేపీలో చేరక పోయినా, ఆయన కమల దళానికి దగ్గరవుతున్నారు. బుధవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో వివాదస్పద వ్యవసాయ చట్టాల గురించి సుదీర్ఘంగా చర్చించిన ఆయన, ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు, అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలో కూడా, అమరీందర్ సింగ్, పాక్ సరిహద్దుల వద్ద ఉన్న భయంకర పరిస్థితి, ఆ మార్గంలో రాష్ట్రంలోకి అక్రమంగా వస్తున్న ఆయుధాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో అజిత్ దోవల్ తో అమరీందర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇదలా ఉంటే  కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరేది లేదని స్పష్టం చేసిన నేపధ్యంలో ఆయన ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని వస్తున్న ఊహాగానాలకు బలంచేకురుతోందని అంటున్నారు.మరో వంక కాంగ్రెస్ పార్టీ ఇటు అమరీందర్ సింగ్’తో అటు సిద్దూతోనూ సంప్రదింపులు జరుతోందని సమాచారం. ఇందులో భాగంగానే మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర మాజీ మంత్రి అంబికాసోనీ కెప్టెన్ సింగ్’తో చర్చలు జరిపినట్లు  తెలుస్తోంది. అయితే అమరీందర్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారని సమాచారం.ఈ సందర్భంగానే, “అవమానాలు భరించడం నావల్ల కాదు” అని ఆయన ఆన్నారని సమాచారం. మరో వంక సిద్దూ ముఖ్యమంత్రి చన్నీని కలిశారు. అధిష్టానం జోక్యం లేకుండా ఆ ఇద్దరు ఒక అంగీకరానికి వచ్చే అవకాశం ఉందని, కొత్త ఫార్ములాతో ఆ ఇద్దరు కలిసి పనిచేస్తారని అంటున్నారు. అదే జరిగితే సిద్దూ మళ్ళీ మరో యూ టర్న్ తీసుకుంటారని వేరే చెప్పనక్కర్లేదు.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.