జనరల్ బిపిన్ రావత్ మృతిపై ఎయిర్ చీఫ్ సంచలనం..

Publish Date:Dec 18, 2021

Advertisement

తమిళనాడు రాష్ట్రంలోని కూనురు సమీపంలో డిసెంబర్ 8న జరిగిన ఆర్మీ హెలికాప్టర్  ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. అత్యంత సురక్షితమైన, భద్రత కలిగిన ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ప్రమాదంపై పలు సందేహాలు తలెత్తాయి. హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఎయిర్ ఫోర్స్ ఆదేశించింది. అయితే 10 రోజులవుతున్నా  ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పక్కా సమాచారం రావడం లేదు. ఘటనాస్థలిలో  దొరికిన బ్లాక్ బాక్స్ ను డీకొడ్ చేస్తూ దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు. 

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. బిపిన్ రావత్ ప్రయాణించిన చాపర్ పై సైబర్ అటాక్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై రోజుకు కొత్త విషయం బయటికి వస్తుండగా..  ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరడ్  కు ముఖ్యఅతిథిగా హాజరైన వివేక్ రామ్..  బిపిన్ రావత్ విమాన ప్రమాదంలో మరణించిన ఘటనపై స్పందించారు.  బిపిన్ రావత్ విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏమి చెప్పలేమన్నారు. ప్రమాదంపై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందని.. విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారన్నారు. 

హెలికాప్టర్ కూలిపోవడానికి వాతావరణ తప్పిదమా..? మానవ తప్పిదమా..? లేక సాంకేతిక లోపమా..? అనేది విచారణ చేస్తున్నామని  ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ప్రమాదంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. ప్రమాదానికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాతే ఏమైనా మాట్లాడగలమన్నారు వివేక్‌రామ్. రావత్ ఘటనపై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలదలుచుకోలేదని చెప్పారు. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి ఎవిడెన్స్‌ను పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి సాక్షిని విచారించాలని.. ఇందుకోసం వారాల సమయం పడుతుందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్. 

తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వివేక్ రామ్. ప్రస్తుతం అక్కడ స్టేటస్ కో మేయింటేయిన్ చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయని... వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్టీ డైమన్షన్ వార్‌పై దృష్టి సారించాలని కాడెట్స్‌కు చెబుతున్నామన్నారు. కేవలం యుద్ధం వైపే కాదు సాంకేతికంగా, సైబర్ పరంగా ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా తిప్పికొట్టేలా నైపుణ్యం సాధించాలని చెబుతున్నామన్నారు. డ్రోన్ దాడులు ఛాలెంజింగ్‌గా మారాయన్నారు. డ్రోన్ దాడుల నుంచి వీఐపీలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.