Publish Date:Apr 13, 2026
భారత ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. రాజకీయ ప్రచారాల్లో సాధారణంగా నాయకులు ప్రత్యక్షంగా ర్యాలీలు నిర్వహిస్తారు. అలాగే సామాజిక మాధ్యమ వేదిక ద్వారా సందేశాలు పంపిస్తారు. అయితే ఈ సారి తమిళనాట సాంకేతిక విప్లవాన్ని కూడా ప్రచారంలో జోడించారు. తమిళరాజకీయాలలోకొ కొత్తగా ప్రవేశించిన నటుడు విజయన్.. తన ప్రచార సరళిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడానికి ఏఐని వినియోగించుకుంటున్నారు.
తమిళనాడులో ఆదివారం (ఏప్రిల్ 12) జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ అభిమాన నాయకుడు సాక్షాత్తు తమ మధ్యే నిలబడి మాట్లాడుతున్నట్లు భావించేలా ఆ ప్రచారం సాగింది.
ఈ ప్రచారంలో దృశ్య రూపంతో పాటు విజయ్ గొంతును కూడా ఏఐ ద్వారా రీ-క్రియేట్ చేసి ప్రసంగాలను వినిపించారు. క్షేత్రస్థాయిలో నేత అందుబాటులో లేని సమయంలో ఏఐ ఆడియో, వీడియో అద్భుతంగా పనిచేస్తోందని అంటున్నారు. భారతదేశంలో ఎన్నికల ప్రచారంలో ఏఐని ఉపయోగించడం ఇదే మొదటి సారి.
గత కొద్ది రోజులుగా టీవీకే తన ప్రచార జోరును పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే అధినేత విజయ్ కటౌట్లు, పోస్టర్లతో పార్టీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఏఐ ప్రచారం మొదలు కావడం ఆ పార్టీలో జోష్ ను పెంచింది. వినూత్న ఆలోచన కేవలం తమిళనాడులోనే కాకుండా, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలకు కూడా మార్గదర్శకం కానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయ్ పార్టీ ఈ సృజనాత్మకత డిజిటల్ యుగంలో రాజకీయ ప్రచారం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టిందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ai-in-tvk-campaign-39-217229.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది