మరోసారి సీఎం పై విరుచుకుపడిన డీఎల్
Publish Date:Feb 9, 2012
Advertisement
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్రా రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రిని రక్షించడానికి సిఎం బిసి సామాజిక వర్గానికి చెందిన మోపిదేవిని బలి చేశారని డీఎల్ గురువారం మీడియా ప్రతినిధులతో కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. బిసి అయినందునే ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణను బలి చేశారని డిఎల్ ఆరోపించారు. మోపిదేవి లంచాలు తీసుకునే వ్యక్తి కాదన్నారు. మోపిదేవి వయస్సులో చిన్నవాడు అని, ఆయనకు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందని, ఇలాంటి వ్యక్తిని టార్గెట్ చేసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో జరగరానివి జరుగుతున్నాయని డీఎల్ తెలిపారు. కాగా డిఎల్ రవీంద్రా రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 108, 104 వ్యవహారం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన లేఖ రాశారు. సిఎం వ్యవహార శైలిపై ప్రధానంగా ఆయన లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. శాఖల కోతలో అసంతృప్తితో వున్న డీఎల్, రాజీనామాను విరమించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/again-24-11749.html





