ఆఫ్ఘన్ లో తాలిబన్లపై తిరుగుబాటు.. మన దేశానిదే కీలక భూమిక?

Publish Date:Aug 18, 2021

Advertisement

ఆఫ్ఘనిస్థాన్  రాజధాని కాబూల్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నతాలిబన్లు సంతోషంలో మునిగి తేలుతున్నారు. మరో వంక ఆ దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ వచ్చిన కిరాతక పాలనకు భయపడి వణికి పోతున్నారు. ఆనాటి అరాచక పాలన, ఆకృత్యాలను గుర్తుచేసుకుని,మాన,ప్రాణాలను కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి పోతున్నారు. ఇక అక్కడ స్థిరపడిన విదేశీయులు అయితే, ఎవరి దేశాలకు వారు పరుగులు తీస్తున్నారు. మరోవంక ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధ్యక్ష భవనాన్ని వదలి పారి పోయారు. దీంతో  ప్రపంచ దేశాలు కూడా ఆఫ్ఘన్ మరోమారు తాలిబన్ల గుప్పిటిలోకి వెళ్లి పోయిందనే, నిర్ణయానికి వచ్చారు. ఆఫ్ఘన్ పరిణామాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తాలిబన్ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు  ప్రకటించారు. ఓ చిరు దివ్వెను వెలిగించారు. అంతే కాదు తనను తాను దేశ తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగంలోని నిబంధనలను ఉదహరిస్తూ సలేహ్ కారణాలు ఏవైనా అధ్యక్ష స్థానంలో అధ్యక్షుడు లేనప్పుడు, మొదటి ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడవుతారని తెలిపారు.అమెరికా, నాటోవలే  తాము స్ఫూర్తిని కోల్పోలేదని పేర్కొంటూ సాలిహ్ తాలిబన్ అరాచకాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సమూహం “ప్రతిఘటన” లో చేరాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 న, తాలిబాన్లు కాబూల్‌లోకి ప్రవేశించినప్పుడు, వారికి లొంగిపోయే ప్రసక్తి లేదంటూ అమ్రుల్లా సలేహ్ ట్వీట్ చేశారు

“నేను ఎప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబ్ ఉగ్రవాదులకు తలవంచను. నా హీరో అహ్మద్ షా మసూద్. కమాండర్ ఆత్మ, వారసత్వాన్ని నేను ఎన్నటికీ మోసం చేయను. లెజెండ్, గైడ్. నా మాట విన్న మిలియన్ల మందిని నేను నిరాశపరచను”అని పేర్కొన్నారు.  ఆ సమయంలో, సలేహ్ ఆచూకీ గురించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఆయన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సమావేశంలోని అగ్ర నాయకుల చిత్రాలలో స్పష్టంగా కనిపించలేదు. ఆయన దేశం వదిలి పారిపోయారని అంటూ పాకిస్తాన్ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఖాతాలు పుకార్లు వ్యాపింపచేశాయి. దానితో సలేహ్ బయటకు వచ్చి,  అన్ని పుకార్లను తోసిపుచ్చాడు.సలేహ్ ట్వీట్ చేసిన అదే రోజున తాను తాలిబాన్‌లో ఎన్నటికీ చేతులు కలిపే ప్రసక్తి లేదని అంటూ ఒక కొత్త చిత్రం తెరపైకి తెచ్చారు.  పంజ్‌షీర్ లోయలో దివంగత తాలిబాన్ వ్యతిరేక కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్‌తో సంప్రదింపులలో సలేహ్‌ను ఆ ఫోటో చూపించింది. 

తాలిబాన్ చేతికి చిక్కని ఒకే ఒక్క ప్రాంతం పంజ్‌షీర్ వ్యాలీ.  ఇక్కడి నుంచే తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడిందని ఇప్పుడు కధనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ తాజిక్ కమాండర్, అహ్మద్ షా మసౌద్’కు గతంలోనూ తాలిబన్లను ఎదిరించడంలో,  భారత్ సహా ఇరాన్, రష్యా వంటి దేశాలతో ఉత్తర కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించారు. ఈ కూటమి సాయుధమై  తాలిబాన్లను తరిమికొట్టింది. పంజ్‌షీర్ లోయ దరిదాపుల్లోకి ఇంతకాలం  తాలిబన్లను చేరనీయ లేదు.అలాగే,  మసౌద్’ 1990 లలో, బుర్హనుద్దీన్ రబ్బానీ క్యాబినెట్‌లో అత్యంత శక్తివంతమైన రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భారత నిఘా సంస్థల నుండి శిక్షణ పొందారు. ఆఫ్ఘన్ ప్రభుత్వ గూఢచారిగా, తరువాత అంతర్గత మంత్రిగా, దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడ ఆయన సారధ్యంలో పంజ్‌షీర్‌లో తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడుతోందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది.  

వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ ఎజ్జతుల్లా మెహర్దాద్ పంజ్‌షీర్‌లో తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పడుతోందని ధృవీకరించారు. “మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్, అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ మొహమ్మదీ అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షీర్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా ప్రతిఘటన దళాన్ని ఏర్పాటు చేస్తున్నారు” అని తెలిపారు. బీబీసీ ప్రతినిధి యల్డా హకీమ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే భౌగోళికంగా కీలకైమైన చైనా, పాకిస్థాన్ తాలిబన్లకు మద్దతు ప్రటించిన నేపధ్యంలో, మరో సరిహద్దుగా ఉన్న మన దేశం మరింత అప్రమత్తం కావలసిన అవసరం ఏర్పడింది. అలాగే, తాలిబన్  వ్యతిరేక కూటమి ఏర్పాటు నిజమే అయితే, మన దేశం పోషించే పాత్ర కూడా కీలకంగా మారుతుంది. అందుకే మన దేశం ముందస్తు వ్యూహాలతో ముందుకు పోతోంది.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.