జగన్ సభలకు పిల్లల తరలింపు.. కోర్టులో జడ శ్రవణ్ కుమార్ పిటిషన్

Publish Date:Jul 29, 2023

Advertisement

రాష్ట్రంలో ఆబాలగోపాలానికి దూషణల స్వరం వినిపించడమే జగన్ లక్ష్యంగా ఆయన సభలు సాగుతున్నాయి. అవేమీ పార్టీ సభలు కాదు. ప్రభుత్వ సభలు. ఆ సభలకు ప్రేక్షకులు ఎవరు అన్న దానితో సంబంధం లేకుండా జగన్ విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పుడా విషయం మళ్లీ కొత్తగా ప్రస్తావించడం ఎందుకు అనుకుంటున్నారా?   

విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్ మెంట్, అమ్మఒడి, విద్యాదీవెన కిట్ల పంపిణీ వంటి సభలకు తరలిస్తున్నారు. అమ్మఒడి, విద్యా దీవెన కిట్లు పంపిణీ వంటి సభలకు పెద్ద ఎత్తున విద్యార్థులను తరలిస్తున్నారు. ఆయా సందర్భాలలో జగన్ ప్రసంగాలు ఆ కార్యక్రమానికి సంబంధించి కాకుండా విపక్ష నేతల పెళ్లిళ్లు కాపురాలు వంటి అంశాలపై ఉంటున్నాయి. విపక్ష నేతలను తూలనాడటంతో తన వాచాలతను చాటుకోవడానికి ఘనత వహించిన సీఎం జగన్  ఒకటో తరగతి పిలల్ని కూడా వదలడం లేదు. ముఖ్యంగా విద్యార్థులను తీసుకువచ్చి మరీ ఏర్పాటు చేసిన సభలలో జగన్ రోడ్డి  ప్రసంగాలు   పెళ్లాలు.. పెళ్లిళ్లు , కాపురాలు, కడుపులూ అంటూ వారిని పెడతోవ పట్టించేలా ఉంటున్నాయి.

జగన్ ఈ తీరుపై   హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.   ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలకు చిన్న పిల్లలను తరలించవద్దని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు  ఉన్నా.. జగన్ పట్టించుకోవడంలేదు. దీంతో న్యాయవాది విశ్లేషకుడు జడ శ్రవణ్ కుమార్ హై కోర్టులో పిటిషన్ వేశారు.  ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సభలకు పిల్లలను తరలించరాదంటూ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పొందుపరుస్తూ, జగన్  కురుపాంలో జగన్ నిర్వహించిన అమ్మఒడి సభ కు పిల్లల తరలింపుపై  ఆర్టీఐ సమాచారంతో జడ శ్రవణ్ కుమార్.. హైకోర్టులో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం విచారించింది.

హైకోర్టు చీఫ్ జస్జిస్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జస్టిస్ ఠాకూర్ విచారించిన తొలి పిటిషన్ ఇదే.  కేసు విచారణ సందర్భంగా పిల్లల్ని తరలించిన విషయాన్ని అధికారులే సమాచారం ఇచ్చారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ , హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.  

జగన్ నిర్ణయాలు, విధానాలే కాదు చివరాఖరికి ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాల సందర్భంగా చేసిన ప్రసంగాలు సైతం వివాదాస్పదమౌతున్నాయి. కోర్టుల ఎదుట న్యాయపరీక్షను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వానికీ, పార్టీకీ తేడా ఏముందన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్న తీరును పరిశీలకులు సైతం తప్పుపడుతున్నారు. ఇప్పుడు కోర్టులో జగన్ కార్యక్రమాలకు పిల్లలను తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలు అధికారుల మెడకు చుట్టుకున్నాయి. అదే విధంగా తాను చేసిన ప్రసంగాలపై కోర్టు ఎదుట వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి జగన్ కు ఎదురైందని పరిశీలకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.