వైసీపీది ధన బలం.. తెలుగుదేశంది జన బలం.. ఏడీఆర్ నివేదిక వెల్లడి.!

Publish Date:Aug 7, 2026

Advertisement

ప్రజా బలం ముందు ధన బలం తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ధన బలంతో గెలిచేందుకు ప్రయత్నించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా,  ప్రజాబలంతో బరిలో నిలిచిన తెలుగుదేశం ఘన విజయం సాధించింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు, గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన ఆర్థిక విశ్లేషణ నివేదిక ప్రస్ఫుటంగా తేల్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది.   
ఏడీఆర్  నివేదిక మేరకు   దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరానికి  తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆదాయం  228.31 కోట్ల రూపాయలు.  ఇది   దేశవ్యాప్తంగా   36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో దాదాపు 19 శాతం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆదాయంలో సభ్యత్వ రుసుములు, పార్టీ చందాలు,  బ్యాంక్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ప్రధాన వనరులుగా నిలిచాయి.

అయితే.. ఎన్నికల  ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ  ఆర్థిక సంవత్సరంలో వైసీపీ  ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే  దాదాపు  199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది. ఈ మొత్తం వ్యయంలో  ఆ పార్టీ  300 కోట్ల రూపాయలకు  పైగా కేవలం ఎన్నికల ప్రచారానికే కేటాయించింది. 

దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ  క్రమశిక్షణతో వ్యయం చేసింది. పార్టీకి వచ్చిన  228.31 కోట్లరూపాయల  ఆదాయంలో తెలుగుదేశం  61.33 కోట్ల రూపాయలు   ఖర్చు చేసింది. ఇందులో ఎన్నికల వ్యయం  31.73 కోట్ల రూపాయలు.   ఆదాయంలో ఏకంగా 73 శాతానికి పైగా..  అంటే  167 కోట్ల రూపాయలను  మిగులు నిధిగా భద్రపరుచుకుంది. ఇదే సమయంలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ రూ.64.1 కోట్ల ఆదాయాన్ని, రూ.56.9 కోట్ల వ్యయాన్ని చూపించింది.

ఏడీఆర్ నివేదికను ఉటంకిస్తూ.. కేవలం ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు గుమ్మరించినంత మాత్రాన ఓటర్లను ఆకట్టుకోవడం సాధ్యం కాదని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ  340 కోట్లకు పైగా వెచ్చించి భారీగా ఎన్నికలలో విజయం కోసం ఖర్చు చేసినప్పటికీ,  ఆ పార్టీ 2024 ఎన్నికలలో గెలిచినది కేవలం 11 స్థానాలలో మాత్రమే.  అదే సమయంలో పరిమిత వ్యయంతోనే   ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన తెలుగుదేశం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో   135 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.   మొత్తానికి  ధనబలం కంటే ప్రజాబలమే పార్టీల విజయానికి కీలకమని అని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,  ఏడీఆర్  నివేదిక కూడా ప్రస్ఫుటంగా తేల్చిచెప్పాయి.  

ADR Report Andhra Pradesh, TDP Election Funds, YSRCP Campaign Expenditure, AP Assembly Elections 2024, Political Party Income, TeluguOne

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.