యర్రగొండపాలెం వైపు ఆదిమూలపు చూపు

Publish Date:May 15, 2025

Advertisement

సిట్టింగ్ స్థానంలో వైసీపీ పాలిట్రిక్స్

 ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారి పోటీ చేసే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తిరిగి సెగ్మెంట్ మారేందుకు కసరత్తు మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో గెలుపొందిన యర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు ఆయన తెర వెనుక రాజకీయాలు మొదలుపెట్టారంట. అందులో భాగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు పొగ పెట్టే పనిలో పడ్డారంట. పార్టీ అధికారం కోల్పోయినా తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ మాజీ మంత్రి పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూస్తున్నారంట. 

ఆ క్రమంలో ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం సొంత నియోజకవర్గం యర్రగొండపాలెం తిరిగి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీలో ఉన్న తన అనుచరుల్ని టీడీపీలో చేర్చడమే లక్ష్యంగా ఆదిమూలపు సురేష్ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జిల్లా  రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  2024 ఎన్నికల సమయంలో తనకు కాకుండా పోయిన ఎర్రగొండపాలెంలో తాత్కాలికంగా ఫ్యాన్ పార్టీని వీక్ చేసి తిరిగి అక్కడ పాగా వేయాలని సురేష్ ప్రయత్నిస్తున్నారంట. ఆ క్రమంలో ఆదిమూలపు సురేష్ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చినీయంశంగా మారింది.

2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గానికి మారి వైసీపీ నుండి గెలుపొందారు. 2019లో తిరిగి తన నియోజక వర్గమైన ఎర్రగొండపాలెం వెళ్లిన సురేష్ ఆ ఎన్నికల్లోనూ గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలోనూ ఆదిమూలపు సురేష్‌కి రెండో సారి మంత్రిగా అవకాశం లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో సురేష్‌తో పాట మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకుడు, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని మూడేళ్ళకే పక్కన పెట్టినా.. సురేష్‌ని ఐదేళ్ళ పాటూ కొనసాగించారు. దానిపై అప్పట్లో బాలినేని అలకపాన్పు ఎక్కడంతో వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. 

మంత్రిగా ఆదిమూలపు సురేష్‌పై అంత నమ్మకం ఉంచిన జగన్ టికెట్ దగ్గరకు వచ్చే సరికి మరోసారి ఆయనకు ఝలక్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్‌ని కొండపి నియోజక వర్గానికి మార్చారు. తప్పనిసరి పరిస్థితులలో ఆయన కొండేపి నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే సురేష్ సిట్టింగ్ స్థానమైన ఎర్రగొండపాలెంలో పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి హవాలోను వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెగ ఫీల్ అవుతున్నారంట. 

కొండపి నియోజకవర్గంలో ఎన్నికల వేళ పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్న ఇల్లు కూడా ఖాళీ చేశారట. ఆదిమూలపు సురేశ్  తిరిగి ఎర్రగొండపాలానికి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. తిరిగి నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే  తాటిపర్తి చంద్రశేఖర్ పరపతిని తగ్గించడమే మార్గమని భావిస్తున్న ఆదిమూలపు సురేష్ ఆ పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.

అందులో భాగంగా  ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెంలో తన ముఖ్య అనుచరులుగా ఉన్న వారిని తెరచాటు రాజకీయం నడిపి సైకిల్ ఎక్కిస్తున్నారన్న టాక్ నడుస్తోందట. ఇటీవల  త్రిపురాంతకం ఎంపిపి  స్థానానికి, పుల్లలచెరువు మండల పరిషత్ వైఎస్ ప్రెసిడెంట్ స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా తన అనుచరులతో కలిసి తెరచాటు రాజకీయం నడిపారని ప్రచారం జరుగుతోంది. 

ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ స్కెచ్ తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయన్ని పిలిచి మందలించారంటున్నారు. ఒక వైపు టీడీపీలోకి తన అనుచరులను పంపుతూ యర్రగొండపాలెంలో వైసీపీని వీక్ చెయ్యాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఇప్పటికే ఆదిమూలపు సురేష్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం యర్రగొండపాలెంలో గుప్పుమంటోందట. ఈనేపథ్యంలో ముందస్తుగా తన అనుచరుల్ని సురేష్ వైసీపీ నుండి టీడీపీలో చేరుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలతో తనకు సంబంధం లేదని ఆదిమూలపు సురేష్ పార్టీ పెద్దలకు వివరణ ఇస్తున్నా...సురేష్ పై మాత్రం రోజురోజుకీ ప్రచారం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. చంద్రశేఖర్‌ని వీక్ చేసి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చేపట్టాలనే వ్యూహంలో ఆదిమూలపు సురేష్ ఉన్నారంటున్నారు. మరి 2029 ఎన్నికల నాటికి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

 

By
en-us Political News

  
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.