భూం భూం.. ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ శిష్యుడు సెటైర్లు!

Publish Date:Sep 13, 2023

Advertisement

ఏపీలో మద్యం బ్రాండ్ల గురించి సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటే.. జనబాహుల్యం అవేం బ్రాండ్లు, అదేం మద్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ధర ఎక్కువ.. నాణ్యత తక్కువ అన్న రీతిలో ఏపీలో మద్యం విధానం ఉందన్న విమర్శలు గత నాలుగేళ్లుగా వినవస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా అనిపించడం లేదు. అది పక్కన పెడితే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వైసీపీ కండువా కప్పుకుని ఈ మధ్య కాలంలో సినిమాలు తీస్తున్నారు. జగన్ కు ఆయన సర్కార్ కు మద్దతుగా ఎప్పుడు పడితే అప్పడు మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనసేనాని పవన్ కల్యాణ్ నడి రోడ్డుపై పడుకున్న సంఘటనపైనా తనదైన శైలిలో స్పందించారు. పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. తన గమ్యం సినిమాలో సీన్ ను కాపీ కొటి ఆయన నడిరోడ్డుపై రక్తి కట్టించడానికి ప్రయత్నించారంటూ ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు. అయితే తాజాగా ఏపీలో బీర్ తాగుతున్నా..ఏమౌతుందో.. ఏమౌతానో అంటూ టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ అయ్యంగార్, సోషల్ మీడియాలో తాను బీరు తాగుతున్న ఫొటో పెట్టి కామెంట్ చేశారు. ఇది వెంటనే వైరల్ అయ్యింది. అన్నిటికంటే మించి నటుడు శ్రీనివాస్ అయ్యంగార్ ఆర్టీవీకి అనుంగు శిష్యుడు. ఆర్జీవీ కాంపౌండ్ లోని మనిషి. అటువంటి ఆర్జీవీ శిష్యుడు జగన్ సర్కార్ మద్యం విధానంపైనా, ఏపీలో తయారౌతున్న బీరుపైనా ఈ రేంజ్ లో సెటైర్లు గుప్పించడం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఔను తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్. విలక్షణ దర్శకుడు ఆర్జీవీ శిష్యుడు. గురువు ఏమో ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంటే.. శిష్యుడేమో ఇన్ డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్ గా ఏమిటి డైరెక్ట్ గానేసెటైర్స్ వేస్తున్నారు. అసలు ఏపీ ప్రభుత్వంపై శ్రీకాంత్ అయ్యంగార్ ఏం మాట్లాడారు? అనే విషయాల్లోకి వెళితే, శ్రీకాంత్ అయ్యంగార్ పోస్ట్ చేసిన వీడియోలో..  తాను విజయవాడ వచ్చానని, ఏపీలో బీరు తాగుతున్నానని చెబుతూ.. ఆయన భూం భూం బీరుని చూపించారు. అక్కడితో ఆగకుండా.. ఇంట్లో చెప్పలేదని, ఇది తాగిన తరువాత ఏమవుతుందో ఏమోనని భయపడుతున్నానంటూ దాన్ని తాగారు. ఇప్పుడదే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్స్ విసురుతున్నారు.

నెటిజన్స్ ఈ రేంజ్‌లో రియాక్ట్ కావటానికి కారణం.. ఏపీలో దొరికే మద్యం అక్కడే తయారవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కొందరైతే అక్కడి మద్యం తాగలేక బయట రాష్ట్రాలకు వెళ్లి అక్కడి మద్యం కొనుక్కుని తాగుతుంటారు. అక్కడ దొరికే బ్రాండ్స్‌పై నెటిజన్స్ ట్రోలింగ్స్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ భూం భూం బీరు తాగే వీడియోను పోస్ట్ చేయటంతో మరోసారి ట్రోలర్స్‌కి పని కల్పించినట్లయ్యింది. ఇంకా బతికే ఉన్నావా? ఆ బీరు తాగి త్వరగా హాస్పిటల్‌కి వెళ్లు అని ఒకరంటే.. తను సరదాగా చేసుంటారని సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని కొందరంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మద్దతుదారులు మాత్రం శ్రీకాంత్ అయ్యంగార్‌పై విరుచుకుపడుతున్నారు.

అయితే కొందరు మాత్రం అసలు మందు తాగితే తాగు, లేదా తాగకపో.. కానీ దాన్ని వీడియోగా చేసి ఏదో భయపడి తాగుతున్నట్లు వీడియో ఎందుకు చేయటం దీని వల్ల లేని పోని సమస్యలు వస్తాయే తప్ప.. మరేమీ ఉండదని అంటున్నారు. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం ఆర్జీవీ శిష్యుడు ఇలా వీడియో చేయటం అనేది వైరల్‌గా మారింది.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.