ట్రాన్స్‌కో డీఈ నివాసాల్లో ఏసీబీ దాడులు.!
Publish Date:Jul 22, 2026
Advertisement
విద్యుత్ శాఖ డీఈ ముత్యం రెడ్డి నివాసాలపై ఏసీబీ బుధవారం (జులై 22) తెల్లవారు జామునుంచే సోదాలు చేపట్టింది. తెలంగాణ ట్రాన్స్‌కో లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీఈ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముత్యం వెంకటరమణ ఇల్లు, కార్యాలయం, ఆయన అత్యంత సన్నిహితుల నివాసాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల మీనాక్షి స్కై లాంజ్ లోని వెంకటరమణ నివాసంతో పాటు ఆయన బంధువులు, వ్యాపార భాగస్వాములు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా ఏసీబీ డక్యుమెంట్లు, డిపాజిట్ బాండ్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీల పత్రాలు, బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకాల స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖలోని ఒక ఉన్నతాధికారి ఇంట ఈ స్థాయిలో 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరగడం కలకలం రేపింది. తనిఖీలు ముగిసిన తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం అక్రమాస్తులు, బంగారు ఆభరణాలు, నగదు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ACB Raids Hyderabad, Telangana Transco DE, Mutyam Venkata Ramana, Disproportionate Assets Case, Transco DE Raids, Anti Corruption Bureau Telangana
ఏసీబీ అధికారులు 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాలలో ఈ సోదాలు ప్రారంభించారు.
http://www.teluguone.com/news/content/acb-raids-transco-des-residences-36-226714.html





