అభిషేక్ వర్మ పరుగుల సునామీ.. ఐదో టీ20లో ఇంగ్లాండ్ చిత్తుచిత్తు

Publish Date:Feb 2, 2025

Advertisement

టి20లలో తనకు తిరుగే లేదని టీమ్ ఇండియా మరోసారి రుజువు చేసుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ ను 4-1తో కైవశం చేసుకుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమ్ ఇండియా ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా పరుగుల సునామీ సృష్టించింది.

ముఖ్యంగా అభిషేక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్  బౌలర్లను సిక్సర్లతో ఓ ఆటాడుకున్నాడు. ఇంగ్లాండ్ పై టి20ల్లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు సృష్టించాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ వర్మ తన బ్యాటింగ్ లో ఐదు ఫోర్టు కొట్టాడు. ఏకంగా 13 సిక్సర్లు బాదేశాడు. బౌండరీ లైన్ ఆవల పడిన బంతిని తీసుకురావడమే ఇంగ్లాండ్ ఫీల్డర్ల పని అన్నట్లుగా అభిషేక్ వర్మ బ్యాటింగ్ జోరు కొనసాగింది.  అభిషేక్ వర్మ బ్యాటింగ్ ధాటికి ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ కకావికలమైపోయింది. గల్లీ బౌలర్లను ఎదుర్కొంటున్నామా అన్నట్లుగా అభిషేక్ వర్మ బ్యాటింగ్ విధ్వంసం కొనసాగింది. తొలి ఏడు ఓవర్లలో టీమ్ ఇండియా ఏకంగా 111 పరుగులు చేసిందంటేనే ఏ స్థాయిలో ఇంగ్లాండ్ బౌలర్లు ఊచకోతకు గురయ్యారో అర్ధం అవుతుంది. 

ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్ గా మలిచిన శాంసన్ త్వరగానే ఔటైపోయాడు. అయితే అభిషేక్ వర్మ తనకు అసలు అడ్డే లేదన్నట్లుగా చెలరేగి పోయాడు. సిక్సర్ల్ మోత మోగించాడు. ఒక దశలో నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోరు అలవోకగా 300 పరుగులు దాటేస్తుందా అనిపించింది. ఆ స్థాయిలో అభిషేక్ వర్మ బ్యాటింగ్ దాడి ఉంది.  అయితే తిలక్ వర్మ , సూర్య కుమార్ యాదవ్ ఫెయిల్ అవ్వడంతో భారత్ పరుగుల వేగం ఒకింత మందగించింది. 10 ఓటర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 143 పరుగుల స్కోరు వద్ద నిలిచింది.  

ఆ తరువాత వచ్చిన శివం దూబె, ఒక సిక్స్ ఒక ఫోర్ తో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించాడు.   కేవలం 13  బంతుల్లో 30 పరుగులు చేసిన శివం దూబె ఔటైన తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా సిక్సర్ తో పరుగుల వేట మొదలెట్టినా కుదురుకోలేదు. రింకూ సింగ్ కూడా పెద్దగా రాణించలేదు.  54 బంతుల్లో 13 సిక్సర్లు 7 ఫోర్ లతో 135 పరుగులు చేసిన అభిషేక్ శర్మ చివరకు అవుట్ అయ్యాడు నిర్ణీత 20 ఒవర్లు పూర్తయ్యే సరికి టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

248 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ వినా మరెవరూ భారత్ బౌలింగ్ మందు నిలవ లేకపోయారు. సాల్ట్ 55 పరుగులు చేశాడు. అతడి తరువాత ఇంగ్లాండ్ బ్యటర్లలో  జాకెబ్ బెతల్ ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. బెతల్ పది పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, శివం దుబె, అభిషేక్ వర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్ కి ఒక వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్   అభిషేక్ వర్మకు దక్కింది. 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.