గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చీపురు చెక్!

Publish Date:Dec 13, 2022

Advertisement

దేశంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. దశాబ్దాల పాటు ఏకఛద్రాధిపత్యంగా దేశంలో అధికారంలో ఉన్నపార్టీ కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. ప్రధాన విపక్షంగానైనా తన స్థానాన్నినిలబెట్టుకోవాలని తాపత్రేయపడుతోంది. అయితే ఇటీవల ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కు, గుజరాత్, హిమాచల్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలహీన పడటం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా  వ్యక్తమైంది.

ఏదో గుడ్డిలో మెల్ల అన్న చందంగా హిమాచల్ లో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ.. కాంగ్రెస్ కు, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి ఓట్ల శాతం ఒకటి కంటే తక్కువే ఉండడాన్ని బట్టే కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ఎంత నేరోగా గెలిచిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గుజరాత్ లో అయితే కాంగ్రెస్ గత ఎన్నికలలో సాధించినన్ని స్దానాలను కూడా గెలవలేకపోయింది. వరుసగా ఆరు సార్లు అధికారంలో ఉండి.. ఏడో సారి ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ గుజరాత్ లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదనడంలో సందేహం లేదు.  దీంతో ఈ సారి గుజరాత్ లో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద బండి నడకే అనుకున్నారంతా. అయితే ఫలితాలు అందుకుపూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ సునాయాస విజయం సాధించింది.

ఇక ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయం తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ సోదిలోకి కూడా లేదన్నంతగా ఫలితాలు వచ్చాయి. ఈ మూడు ఎన్నికల ఫలితాలలో ఒక విషయం మాత్రం ప్రస్ఫుటంగా తేలుతున్న విషయం ఏమిటంటే.. ఢిల్లీలో కాంగ్రెస్   ఉనికి మసకబారింది. గుజరాత్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ను కబలించేయడానికి ఆప్ రోజు రోజుకూ బలపడుతోంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాకున్నా, ఆ తరువాతి ఎన్నికల సమయానికైనా కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి ఆప్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని  రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నాయి. 

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రస్థానం ప్రారంభించినది మొదలు  ఏనుగు కుంభ స్థలాన్నే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోందనేలాగే ఆ పార్టీ ప్రస్థానం కొనసాగింది. బీజేపీ, కాంగ్రెస్ లను సవాల్ చేస్తూ తొలుత ఢిల్లీలో బలపడింది. ఆ తరువాత అంచలంచలుగా ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్నది.    బీజేపీయేతర, కాంగ్రెస్సెతర పార్టీలకు, కూటములకు ప్రత్యామ్నాయంగా బలపడుతోంది.  ఢిల్లీలో వరుసగా రెండవసారి అధికారం చేజిక్కించుకోవడమే కాకుండా, పంజాబ్ లో కాంగ్రెస్ ఆశలకు గండి కొట్టి మరీ అక్కడ అధికారాన్ని దక్కించుకోవడం వరకూ.. ఆప్ రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించే దిశగానే సాగుతోందని చెప్పవచ్చు.

ఓట్లూ, సీట్లూ లెక్కలను పక్కన పెట్టి జనానికి చేరువ కావడం అన్న వ్యూహంతోనే ఆ పార్టీ అడుగులు వేస్తున్నది. ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రాలలో బలోపేతం కావడంపైనే దృష్టి పెట్టింది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లూ, సీట్ల విషయంలో ఆ పార్టీ ఎటువంటి సంచలనాలూ సృష్టించ లేదు.. కానీ రెండు రాష్ట్రాలలోనూ పార్టీల (బీజేపీ, కాంగ్రెస్) గెలుపు ఓటములను ప్రభావితం చేసింది. హిమాచల్ లో పోటీ చేసిన ఏ స్థానంలోనూ డిపాజిట్ దక్కించుకోకపోయినా.. ఆప్ ఆ రాస్ట్రంలో తన ఉనికిని బలంగా చాటిందనడంలో సందేహం లేదు. ఆప్ భావజాలం ప్రజలపై ప్రభావం చూపుతోందన్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రజల ఆలోచనలను ప్రత్యామ్నాయం వైపు మళ్లించేలా ఆప్ ప్రయత్నాలు ఫలించే సూచనలూ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి కాకుండా మరో సింగిల్ పార్టీ ప్రత్యామ్నాయం కోసం ఆప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు ముందు జనం ఆకర్షితులయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న స్థానంపై ఆప్ కన్నేసింది. ఢిల్లీలో అది సాధించింది.

ఇక జాతీయ స్థాయిలో ఆ స్థానం కోసం ఆప్ అడుగులు వేస్తోంది. కూటముల, ఫ్రంట్ ల కలగూర గంప ప్రభుత్వాలను చూసిన ప్రజలు సింగిల్ పార్టీగా జాతీయ స్థాయిలో ఆప్ కు ఓ చాన్స్ ఇస్తే అన్న ఆలోచన కలిగేలా చేయడం కోసమే ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న విషయాన్ని గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాలు తేటతెల్లం చేశాయి. 

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.