కాంగ్రెస్ స్వయంకృతం.. పంజాబ్‌లో ఆప్ దే హవా...

Publish Date:Jan 13, 2022

Advertisement

పంజాబ్  శాసన సభ ఎన్నికలలో ప్రధాన పోటీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యనే ఉంటుంది. బీజేపీ, అకాలీదళ్, అలాగే మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ, ఇతర చిన్నా చితక పార్టీలు అన్నీ  ఆటలో అరటి పండులా మిగిలి పోవడమీ కానీ, పెద్దగా ప్రభావం చూపే ఆకాశం  లేదు. ఈ విషయంలో  ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు.. అయితే, కాంగ్రెస్, ఆప్ పార్టీలలో ఎవరిదీ పై చేయి అంటే, కాంగ్రస్ పార్టీకి ఉన్న సుదీర్ఘ చరిత్ర, పరిపాలనా అనుభవం దృష్ట్యా నిస్సందేహంగా  కాంగ్రెస్ పార్టీదే పై చేయి,   కావాలి, కానీ,  అంతర్గత కుమ్ములాటలతో పార్టీ కుదేలైపోయింది. పార్టీ ముఖ్య నేతల మధ్య  కలహాలు ఆ పార్టీ విజయావకాశాలను గట్టిగా దెబ్బ తీస్తున్నాయని పరిశీలకు  భావిస్తున్నారు, నిజానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ 'ను కాదని నవజ్యోతి సింగ్ సిద్దూకు పార్టీలో  ప్రాధాన్యత ఇవ్వడంలోనే కాంగ్రెస్ పార్టీ తప్పులో కాలేసింది. .ఇప్పుడు ఆ తప్పు  దిద్దుకోలేని  స్థితికి చేరిందని పంజాబ్ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పరిశీలకులు పేర్కొంటున్నారు. 

అదలా  ఉంటే,    ఆలూ లేదు చూలు లేదు .. కొడుకు పేరో ఏదో   అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ లో,  'కౌన్ బనేగా ముఖ్యమంత్రి' పేరిట కొత్త వివాదం సాగుతోంది. కొద్ది రోజుల్లో ఫిబ్రవరి 14న  జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ , ఇటు  పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. సహజంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల ఎంపిక ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియని విషయం  కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు బీజేపీలోనూ అదే  జరుగుతోందనుకోండి , అయినా  సీల్ల్డ్  కవర్ కల్చర్ అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీనే గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రులను నియమించాహదం అయినా తీసేయడం అయినా అంట అధిష్ఠానం అభీష్టం మేరకు జరుగుతుందే కై, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఉండదు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అదే పరిస్థితి. 
పంజాబ్ విషయానికి వస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండు 'ముఖ్య' ముఖాలు ఉన్నాయి. ఒకరు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కాగా, మరొకరు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ ఇద్దరు నేతలు తాజాగా వెల్లడించిన అంశాలను చూస్తుంటే  ఇది కూడా చిలికి చిలికి గాలివానగా మారి, కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలని మరింతగా దెబ్బతీసేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. 

ఒకరు హైకమాండ్ నిర్ణయం అంటుంటే మరొకరు ప్రజలు నిర్ణయిస్తారని అంటున్నారు. మరొక నేత అయితే అసలు అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. ఈ అందరి అభిప్రాయం ఆలోచనలు  ఏలా  ఉన్నా, కాంగ్రెస్ అధినాయకత్వం ఏరి కోరి ఇచ్చి నెత్తిన పెట్టుకున్న పీసీసీ చీఫ్ నవజ్యోతి  సింగ్ సిద్దూ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అంటున్నారు.  

"ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పుడు పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ 2017లో అభ్యర్థిని ప్రకటించి విజయం సాధించింది. ఈసారి కూడా అభ్యర్థిని ప్రకటిస్తారు. కాకపోతే ఆ అభ్యర్థి ఎవరని హైకమాండ్ నిర్ణయిస్తుంది " అని  ముఖ్యమంత్రి  చన్నీ అంటే,  హై కమాండ్ ఎవరు .అంటూ  సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ముఖ్యమంత్రిని హై కమాండ్ కాదు,  ప్రజలు నిర్ణయిస్తారు. హైకమాండ్ సీఎంను నిర్ణయిస్తుందని మీకు ఎవరు చెప్పారు?’అని విలేకరులను ఎదురు ప్రశ్నించారు.
ఇక ఇదే అంశంపై సునిల్ జాఖర్ స్పందిస్తూ ‘‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించరు. జాయింట్ లీడర్‌షిప్‌లోనే పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది’’ అని సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై సీఎం చన్నీ ఒకలా పీసీసీ చీఫ్ సిద్ధమూ మరొకలా పార్టీ నేతలు ఇంకోలా స్పందిస్తున్నారు. దీంతో అసలు కాంగ్రెస్ పార్టీ తరపు సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీలోని నేతలే తేల్చుకోలేకపోతున్నారు. ఇలా నాయకుల మధ్య ప్రతి విషయంలోనూ ఎడ్డెమంటే తెడ్డెమనే ధోరణి కొనసాగీతే, ప్రజలు అసహ్యించుకుఅంటారని పరిశీలకులు అంటున్నారు. 

నిజానికి పంజాబ్ ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) లోనూ ముఖ్యమంత్రి ఎవరన్న మీమాంస ఉంది. ముఖ్యమంత్రి పేరు ప్రకటించకుండా బరిలో  దిగితే ఓటమి తప్పదనే సెంటిమెంట్ పంజాబ్ ఆవ్  నేతలు కూడా వ్యక్త పరుస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆప్  అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్నారు.  సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్'అయితే బాగుంటుందని భావిస్తున్నానని, కేజ్రీవాల్ తెలిపారు. అయితే ప్రజలే దీనిని నిర్ణయించాలని, నిర్ణయాన్ని ప్రజల కోర్టు లోకి  నెట్టశా రు 

నిజంగానే ఆప్  తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ ప్రకటించేలేని పరిస్థితి వస్తే, అది కాంగ్రెస్ పార్టీకి  మరో  మైనస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. ఏఁమైనా కాంగ్రెస్ స్వయం కృతంతో ఢిల్లీకే  పరిమితం అనుకున్న ఆప్ పంజాబ్ లోనూ జెండా ఎగరేస్తుందని పరిశీలకులు అంటున్నారు. అలాగే, పంజాబ్ తో పాటు గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న ఆప్, పంజాబ్ లో గెలిచి గోవా లోకాలుమోపితే,  జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయంగా ఒక ప్రత్యాన్మాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, చివరకు ఏమి జరుగుతుంది అనేది . మా ర్చి 10 న తేలిపోతుంది.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.