నెల్లూరు జిల్లాలో ఆనం ఒంటరేనా? కేబినెట్ బెర్త్ మళ్ళీ అందని ద్రాక్షేనా? 

Publish Date:Sep 22, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు మొదలు పెట్టారు. అధికారంలోకి వచ్చి  రెండున్నర సంవత్సరాలు దగ్గరవుతున్న నేపధ్యంలో, ముందుగా అనుకున్న విధంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ గడువు సమీపిస్తోంది. ముఖ్యమంత్రి తోలి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే , రెండున్నర ఎల్లా తర్వాత ఉద్వాసన ఉంటుందని, అప్పాయింట్ ఆర్డర్స్ తో పాటుగానే ఊస్టింగ్  ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. సో.. ఆ గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి  కసరత్తు ప్రారంభించారని  పార్టీలో చర్చ జరుగుతోంది. 

కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లేందుకు  సిద్దంగా ఉండమని మంత్రులకు హింట్ ఇచ్చారని వార్తలొచ్చాయి. మరో వంక ఫస్ట్ కాబినెట్ లో బెర్త్ మిస్సయిన సీనియర్ నాయకులు ఈ సారైనా ఛాన్స్ దక్కుతుందా లేదా అని ఆశగా ఎదురుస్తున్నారు. అలాంటి వారిలో కొదరు తమ వంతు ప్రయత్నాలు  ప్రారంభించారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. 

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు ఆనం రామ నారాయణ రెడ్డి, అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్’లోనే మంత్రి పదవి వస్తుందని ఆనం ఆశించారని అంటారు. నిజానికి అయన రెండు సార్లు పార్టీ మారింది, మంత్రి పదవి కోసమే అని అయన సన్నిహితులు అంటారు. మంత్రి పదవిని ఆశించే అనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినా  కారణాలు ఏవైనా చంద్రబాబు నాయుడు ఆనంకు అవకాశం ఇవ్వలేదు. 

ఈ నేపధ్యంలోనే ముందుగానే  జగన్ దగ్గర మాట పుచ్చుకుని మరీ ఆనం సోదరులు 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా  చేసి వైసీపీలో చేరారు. అయితే అక్కడ కూడా మళ్ళీ అదే కథ.  అదృష్టం మళ్ళీ అడ్డం తిరిగింది. మంత్రి పదవి రాలేదు. అనం ఆశించిన సీనియర్ కోటాను జంగన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు. కారణాలు ఏవైనా ఆయన సీనియర్లు వద్దనే అనుకున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన బెర్తులన్నీ జూనియర్లకే కేటాయించారు. నెల్లూరు జిల్లా నుంచి రెడ్డి కోటాలో మేకపాటికి, బీసీ కోటాలో అనిల్ కుమార్ కు  అవకాశం ఇచ్చారు. ఈనేపధ్యంలో ఇప్పుదైనా ఆనంకు మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ  జరుగుతోంది. 

అయితే ఈసారీ.. ఆనంకు సారీనే అనటున్నారు. అనంతో పాటుగా జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారు కనీసం మరో ఐదుగురు వరకు ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, కోటం రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి, సంజీవయ్య ..మంత్రి పదవుల రేసులో ఉన్నారు. మరో వంక పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా  గే;లిచింది మొదలు ఆనం రామ నారాయణ రెడ్డి,  జగన్ ఆశించింది ఇవ్వలేక పోయారు. విధేయత చూపడంలో విఫలమయ్యారు. అసమ్మతి గళం కూడా వినిపించారు. అంతే కాదు, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, జగన్ రెడ్డిని చాలా దుర్మార్గంగా దూషించారు. కాబట్టి ఆనంకు మంత్రివ పదవి ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని అంటున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.