టన్నెల్ లో ఉబికి వస్తున్న ఊట ...పొంచి ఉన్న మరో ముప్పు
Publish Date:Mar 4, 2025
Advertisement
ఎస్ఎల్ బిసీ టన్నెల్ లో రిస్క్యూ టీం ఆపరేషన్ చేస్తున్నప్పటికీ టిబిఎం పైకప్పు నుంచి కంటిన్యూగా వస్తున్న ఊట సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రమాదం జరిగి 11 రోజులు కావస్తున్నా డెడ్ బాడీస్ ఆనవాళ్లు కనిపించడం లేదు. టిబిఎం మిషన్ పూర్తిగా తొలగిస్తే కానీ కనిపించకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కానుంది. టిబిఎం మిషన్ విడి భాగాలు కట్ చేస్తేనే డెడ్ బాడీలు దొరకవచ్చని రిస్కూ టీం సిబ్బంది చేబుతున్నారు. ఒక్కో షిప్టులో 70 మంది పని చేస్తున్నారు. ఇన్ వార్డ్ నుంచి 13.5 కిలో మీటర్ల వద్దే ప్రమాదం జరిగింది. కన్వేయర్ బెల్ట్ చెడిపోవడంతో కొత్త కన్వేయర్ బెల్ట్ ను బిగించే పనిలో ఉన్నారు. కన్వే యర్ బెల్ట్ ద్వారానే బురద,రాళ్లను బయటకు పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న లోకో ట్రైన్ వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. టన్నెల్ పై కప్పు నుంచి వస్తున్న ఊటను డీ వాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. హ్యుమన్ లాస్ ను నివారించేందుకు రోబోలను రంగం లో దించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. జిపిఎ ద్వారా స్కానింగ్ చేసినప్పుడు డెడ్ బాడీస్ ఆనవాళ్లు కనపించాయని తొలుత అధికారులు చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జిపిఏ సిస్టం ఫెయిల్ కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/a-spring-emerging-in-the-tunnelanother-looming-threat-39-193827.html





