2027.. జగన్, కేసీఆర్ యాత్ర స్పెషల్ సంవత్సరం!?

Publish Date:Jun 9, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.  ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఏమిటని చూస్తే..  ఆయన  2027వ సంవత్సరంలో తాను సరికొత్త చారిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన బహిరంగంగానే వెల్లడించారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్‌ను రాబోయే కొద్ది నెలల్లోనే వైసిపి శ్రేణులు సిద్ధం చేయనున్నాయి. అయితే ఈసారి జగన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. 2027లో అడుగు ముందుకు వేస్తే, మళ్లీ 2029 అసెంబ్లీ ఎన్నికల ముగింపు వరకు ఆయన నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రను తిరగరాసి ఆయనకు బంపర్ మెజారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు 2026 దాటి 2027 రాగానే అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను పూర్తిగా తన వైపు తిప్పుకోవడానికి ఈ సుదీర్ఘ పాదయాత్రే ఏకైక మార్గమని ఆయన నమ్ముతున్నారు.

ఇక ఇప్పుడు బీఆర్ఎస్  అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు విషయానికి వస్తే.. ఆయన కూడా జగన్ రూట్ నే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన కూడా ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ పాదయాత్ర ద్వారా ప్రజలలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే.. కేసీఆర్ బస్సు యాత్ర అంటున్నారు. అదోక్కటే తేడా మిగతాదంతా సేమ్ టూ సేమ్.  ఇద్దరూ ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికీ.. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి 2027ను   కీలకంగా భావిస్తున్నారు.  

  2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అయితే ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ 2027 ప్రారంభం నుండి కేసీఆర్ సరికొత్త అవతారంలో ప్రజల ముందుకు రానున్నట్లు ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీష్ రావు అధికారికంగా స్పష్టం చేశారు. 2027 నుండి కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషించబోతున్నారు. ఇందుకోసం ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గాన్ని తాకుతూ సాగే ఈ బస్ యాత్ర ద్వారా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ బాస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.  చూడాలి మరి ఏపీలో జగన్ పాదయాత్ర, తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రలకు జన స్పందన ఎలా ఉంటుందో?

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.