Publish Date:Jun 11, 2026
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. నాలుగు స్థానాలకు నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలవడంతో అభ్యర్థుల ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ రాజ్యసభకు ఎన్నిక కాగా, జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి పోటీలో ఈ నలుగురు అభ్యర్థులే మిగలడంతో ఎన్నిక అనివార్యంగా ఏకగ్రీవమైంది. దీంతో అధికార కూటమికి చెందిన అభ్యర్థుల విజయం ముందుగానే ఖరారైంది. ఎన్నికైన సభ్యులకు రిటర్నింగ్ అధికారి వనిత రాణి అధికారిక ధ్రువీకరణ పత్రాలు (ఫారం-22) అందజేయనున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం జూన్ 1న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తికాగా, ఏపీలో నాలుగు స్థానాలకు నాలుగు నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/4-rajya-sabha-seats-in-ap-unanimously-25-222613.html
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.