24 గంటలు.. 12 అత్యాచారాలు.. తమిళనాట ప్రభుత్వం ఉందా?

Publish Date:Jun 17, 2026

Advertisement

తమిళనాడు ఒకప్పుడు దేశంలోనే మహిళల రక్షణకు, శాంతిభద్రతలకు మారుపేరుగా నిలిచింది. శాంతి భద్రతల విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలో కానీ తమిళనాడు దేశానికి ఆదర్శవంతంగా ఉండేది. అయితే  గడిచిన కొన్నేళ్లుగా అక్కడ  పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో   కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 12 లైంగిక దాడి కేసులు నమోదు అయ్యాయి.  

శాంతిభద్రతలకు నిలయంగా భావించే చెన్నై నగర పరిధిలోనే ఈ ఘోరాలన్నీ చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.   నమోదు అయిన కేసుల్లో ఒకటి మూడు సంవత్సరాల చిన్నారిపై   హత్యాచారం. అలాగే.. మరో ఏడుగురు మైనర్ బాలికలపై కూడా లైంగిక దాడులు జరిగాయి.  అంటే మొత్తం కే12 కేసుల్లో ఎనిమిది  మైనర్ బాలికలపై జరిగిన లైంగిక దాడులే కావడం  ఈ నేరాల తీవ్రతను తెలియజేస్తున్నది.  నగరంలో మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని చెప్పడానికి  24 గంటల వ్యవధిలో 12లైంగిక దాడుల కేసులు నమోదు కావడమే నిదర్శనం. 

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం నడుస్తోంది. నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారి  ఇటీవలె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్  ఇప్పుడు రాష్ట్రంలో, రాష్ట్ర రాజధానిలో పెరిగిపోయిన ఈ నేర సంస్కృతిని ఎలా అరికడతారన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. నేరాలను అరికట్డడం, మహిళా భద్రత విషయంలో రాష్ట్రం, చెన్నై నగరాన్ని సురక్షితం అన్న విశ్వాసాన్ని పాదుగొలపడం, ఆయన పాలనకు, పాలనా దక్షతకు ఒక పరీక్షగా మారిందనడంలో సందేహం లేదు.  కేవలం ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై, పోలీసు యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

సోషల్ మీడియా వేదికగా నెటిజనులు సీఎం విజయ్ స్పందనను, కఠిన చర్యలను డిమాండ్  చేస్తున్నారు.   ఇలాంటి మృగాళ్లపై   సాధారణ చట్టపరమైన చర్యలు సరిపోవని, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   శాంతిభద్రతల పరిరక్షణలో  ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా కనబడుతోంది.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల తర్వాత ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా దక్కించుకున్న మూడవ విమానాశ్రయంగా భోగాపురం నిలిచింది. ఈ పరిణామం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ RAW NTR (రా-ఎన్టీఆర్) పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు
తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది.
రూ.2 లక్షల లంచంతో ఏఈ దొరికేశాడు..
సార్, ఒకసారి హగ్ చేసుకోవచ్చా.. యువ వైద్యుడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి విజయ్..!
ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
పాతబస్తీకి చెందిన రెండు కుటుంబాలు లులు మాల్ సెల్లార్ పార్కిం గ్‌లో ఒక్కసారిగా వాగ్వాదా నికి దిగారు. గొడవ తీవ్రరూ పం దాల్చుతున్నట్లు గుర్తిం చిన మాల్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి.
టాటా క్యాపిటల్ రూ.318 కోట్లతో యోగ్‌లోన్స్‌లో 88.6% మెజారిటీ వాటాను కొనుగోలు చేసి అధికారికంగా గోల్డ్ లోన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భారీ డీల్ వివరాలు మరియు పసిడి రుణాల మార్కెట్ వృద్ధి గణాంకాలు ఇక్కడ చూడండి.
ప్రముఖ డచ్ ఫుట్‌బాల్ రెఫరీ రాబ్ డీపెరింక్ 38 కన్నుమూశారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారుల జాబితా నుండి తొలగించిన కొద్ది వారాలకే జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు మీకోసం.
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి భారత గడ్డపై విదేశీ లీగ్ మ్యాచ్! క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన BBL 2026 27 పూర్తి షెడ్యూల్ విశేషాలు, చెన్నై చేపాక్ స్టేడియంలో జరగబోయే చారిత్రక మ్యాచ్ వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.