లులు మాల్ లో తుపాకి కలకలం.!

Publish Date:Jul 14, 2026

Advertisement

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లులు మాల్‌లో ఓ వ్యక్తి తుపాకీతో ప్రత్యక్ష మవడం తీవ్ర కలకలం రేపింది. రెండు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ సమయంలో గన్ బయటపడటంతో మాల్‌కు వచ్చిన సందర్శకులు, ఇతర వాహనదారులు భయాందో ళనకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన రెండు కుటుంబాలు లులు మాల్ సెల్లార్ పార్కిం గ్‌లో ఒక్కసారిగా వాగ్వాదా నికి దిగారు. గొడవ తీవ్రరూ పం దాల్చుతున్నట్లు గుర్తిం చిన మాల్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఓ వైపుపరిస్థితిని అదుపు చేస్తూనే మరోవైపు   కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సిద్ధిఖీని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న తుపాకీ స్వాధీనం చేసుకు న్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ లో ఆ తుపాకీకి చట్టబద్ధ మైన లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే, తుపాకీతో ఉన్న వ్యక్తి ఎలాంటి తనిఖీలు లేకుండానే మాల్ సెల్లార్ పార్కింగ్‌లోకి ప్రవేశించడం  భద్రతా వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది. 

వాహనాలను సెల్లార్‌లోకి అనుమతించే సమయంలో భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించలేదని గుర్తించారు. అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఘర్షణను అదుపులోకి తీసుకురావడంతో సిద్ధిఖీ తుపాకీని ఉపయోగించే పరిస్థితి రాలేదని పోలీసులు  భావిస్తున్నారు.ఈ ఘటన ను తీవ్రంగా పరిగణించిన పోలీసులు లులు మాల్ యాజమాన్యం భద్రతా నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించిందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనకు సంబంధించి మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

KPHB Lulu Mall Hyderabad, Hyderabad Crime News, Parking Dispute Gun Threat, Lulu Mall Security Lapse

By
en-us Political News

  
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ RAW NTR (రా-ఎన్టీఆర్) పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు
తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది.
రూ.2 లక్షల లంచంతో ఏఈ దొరికేశాడు..
సార్, ఒకసారి హగ్ చేసుకోవచ్చా.. యువ వైద్యుడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి విజయ్..!
ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి.
టాటా క్యాపిటల్ రూ.318 కోట్లతో యోగ్‌లోన్స్‌లో 88.6% మెజారిటీ వాటాను కొనుగోలు చేసి అధికారికంగా గోల్డ్ లోన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భారీ డీల్ వివరాలు మరియు పసిడి రుణాల మార్కెట్ వృద్ధి గణాంకాలు ఇక్కడ చూడండి.
ప్రముఖ డచ్ ఫుట్‌బాల్ రెఫరీ రాబ్ డీపెరింక్ 38 కన్నుమూశారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారుల జాబితా నుండి తొలగించిన కొద్ది వారాలకే జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు మీకోసం.
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి భారత గడ్డపై విదేశీ లీగ్ మ్యాచ్! క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన BBL 2026 27 పూర్తి షెడ్యూల్ విశేషాలు, చెన్నై చేపాక్ స్టేడియంలో జరగబోయే చారిత్రక మ్యాచ్ వివరాలు ఇక్కడ చదవండి.
నేటి 14 జూలై 2026 నిఫ్టీ ప్రిడిక్షన్ మరియు కీలక సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిల పూర్తి సాంకేతిక విశ్లేషణ. మార్కెట్ బేరిష్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా.
ప్రముఖ హైరింగ్ టెక్నాలజీ సంస్థ జోబిన్ (Xobin) సరికొత్త ఏఐ ఏజెంట్ నూరా (NURA) ను లాంచ్ చేసింది. కేవలం 10 నిమిషాల్లో 10 లక్షల రెజ్యూమేలను స్క్రీనింగ్ చేస్తూ, ఏఐ ఇంటర్వ్యూలు నిర్వహించే ఈ టెక్నాలజీ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.