లక్ష్యాన్ని ఛేదించిన జగన్, కాంగ్రెస్ గుండెల్లో జగన్ బుల్లెట్

Publish Date:Jun 15, 2012

Advertisement

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి జైలులో ఉన్నా కాంగ్రెస్ గుండెల్లో మంటలు రేపాడు. ఉపఎన్నికల్లో అత్యధికస్థానాలు గెలుచుకుని అధికార కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టాడు. సిబీఐ అనే బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ జగన్ పై ప్రయోగించినా అది లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది. దీనికి ప్రతిగా జగన్ సంధించిన సానుభూతి అస్త్రం కాంగ్రెస్ ను కళావికలం చేసింది. నేడు తగిలిన ఈ దెబ్బ రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తులో పెద్దముప్పుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండున్నర నెలల క్రితం తెలుగుదేశంపార్టీ కిరణ్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి మద్దతుగా వై.ఎస్. సానుభూతిపరులైన ఎమ్మెల్యేలు ఓటువేసి అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో రాష్ట్రంలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. జగన్ చేస్తున్న ఓదార్పుయాత్రలకు అనూహ్య స్పందన్ వస్తుండటంతో అటు కాంగ్రెస్, ఇటు టిడిపిలు బెంబేలెత్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికలను సాకుగా తీసుకుని జగన్ పార్టీని భూస్థాపితం చేయటానికి రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తన ఆఖరి అస్త్రంగా సిబీఐను ప్రయోగించింది సిబీఐ జగన్ ను జైలులో పెట్టినా ఫ్యానుగాలి జోరు తగ్గకపోగా, విజయమ్మ, షర్మిల రూపంలో పెద్ద తుఫానుగా మారి కాంగ్రెస్, టిడిపిలను కుదిపేసింది. రాజశేఖరరెడ్డి అవినీతికి పాల్పడ్డారని, జగన్ దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని కాంగ్రెస్, టిడిపిలు ఊరువాడా ప్రచారం చేసినప్పటికీ ఎటువంటి స్పందన కనిపించలేదు.



గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 37.03 శాతం ఓట్లు, తెలుగుదేశంపార్టీకి 35.66 శాతం ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి సుమారు 15.6 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావటంతో ఈ ఓట్ల శాతం 51 శాతంకు పెరిగింది. దీనికి తోడు టిడిపికి ఉన్న 35.56 శాతాన్ని కూడా కలిపితే సుమారు 87 శాతం ఓట్లు ఈ మూడు పార్టీలకు వచ్చినట్లు భావించాలి. అయితే 0 స్థాయినుంచి ప్రారంభమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను మట్టికరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బైబిల్ కథలోని డేవిడ్ అనే చిన్నకుర్రాడు తన చేతిలోని వడిశేలతో గొలియత్ అనే ఒక భీకరాకురుడిని హతం చేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. ఇక్కడ జగన్ అనే జూనియర్ రాజకీయనాయకుడు ఏకంగా ఇద్దరు ప్రత్యర్థులకు ఒకేసారి మట్టికరిపించాడు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలతో పాటు బలమైన మీడియా వర్గాలు కూడా జగన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించాయి. సోనియాగాంధీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తేసుకుని వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్లకు ఎన్నికల ప్రచారానికి పంపింది. అలాగే టిడిపి అన్ని చోట్ల ఏరికోరి డబ్బున్నవారికే టిక్కెట్లు కట్టబెట్టింది. ఇక జగన్ ను వ్యతిరేకించే ఎలక్ట్రానిక్ ఛానల్స్, వార్తాపత్రికలు జగన్ అవినీతిపై పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు గుప్పించాయి. జగన్ కు ఓటు వేస్తే ప్రజలు అవినీతిని సమర్థించినట్లేనని తీర్మానించాయి. అయినా ఓటర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అవినీతి ఆరోపణలు అందరిపైనా ఉన్నాయంటూ జగన్ కె తమ మద్దతును ప్రకటించారు.

By
en-us Political News

  
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.