రంగారెడ్డి జిల్లాకే యూత్‌ కాంగెస్ర్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి

Publish Date:Jul 2, 2012

Advertisement

పోటా పోటీగా జరుగుతున్న యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన రవికుమార్‌ యాదవ్‌ పోటీలో ముందున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36,000 ఓట్లున్న యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి 12,000 నుంచి 13,000 ఓట్లు తెచ్చుకున్నవారు అధ్యక్షులు కావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. రాష్ట్ర స్థాయిలో బరిలో 27మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికి వచ్చిన ఓట్లను బట్టి రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటవుతుంది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 850 ఓట్లకు పైగా ఉన్నాయి. ఈ బరిలో ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ కుమారుడు రవికుమార్‌ ప్రధాన అభ్యర్థి. గతంలో ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు, జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన వంశీచందర్‌రెడ్డికికూడా జిల్లాలోని బూత్‌ కమిటీలు మద్దతు పలికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ కూడా రంగంలో ఉన్నారు. దేవినేని నెహ్రూతనయుడు అవినాశ్‌, రాష్ట్ర మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌, ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కుమారుడు పురువర్‌రెడ్డి కూడా రంగంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 11, 12 తేదీలలో జరగనున్న ఎన్నికల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది.

 

 

కొత్త విధానం ప్రకారం జిల్లా అధ్యక్షులు కాకుండా అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్‌ నియోజకవర్గం, అనంతరం రాష్ట్ర అధ్యక్ష పదవికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. సీనియర్‌ నాయకులకు మింగుడు పడని ఈ విధాన్నా యువ నేతలు ఆకళింపు చేసుకుని తమ అభ్యర్తిత్వాలను లక్ష్యంగా చేసుకుని సభ్యత్వ నమోదును చేయించడం గమనార్హం. ఈ విధంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనే పోటీ ప్రభావం నెలకొని ఉన్నది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి అభ్యర్థి రవికుమార్‌కు హోంమంత్రి సబితారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి దన్నుగా నిలుస్తున్నాడు. కార్తీక్‌రెడ్డి కోరుకుంటున్న చేవెళ్ళ పార్లమెంట్‌ స్థానంలో ఆయన అనుయాయుడు రణధీర్‌రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేవెళ్ళ పార్లమెంట్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని తలపోస్తున్న కార్తీక్‌రెడ్డికి రవికుమార్‌ యాదవ్‌కే మద్దతు తెలుపక తప్పని పరిస్థితి ఎదురవుతున్నది. రాష్ట్రఅధ్యక్ష పదవికి ప్రధానంగా రవికుమార్‌కు, మహబూబ్‌నగర్‌కు చెందిన వంశీచందర్‌ ముందున్నప్పటికీ ఓట్ల విషయంలో రాష్ట్రంలో రెండవ స్థానంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉన్నది. మొదటి స్థానంలోఉన్న నెల్లూరు నుంచి అధ్యక్షపదవి పోటీలో ఎవరూ లేరు. దీంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి. వంశీ చందర్‌రెడ్డి కోస్తా ప్రాంతం నుంచి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కనీసం 10 నియోకవర్గ్ణాల్లో పూర్తి స్థాయి మద్దతుంటే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడం ఖాయం. అయితే ఇప్పటి వరకూ పోటీ చేసే అభ్యర్థుల పరిధిలోని ఎమ్మెల్యే, ఎంపీలు మినహాయించి రాష్ట్రంలో ప్రముఖులెవరూ జోక్యం చేసుకోవడం లేదని తెలిసింది. కనుక అభ్యర్థుల అంగ, అర్థబలాలపైనే ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

By
en-us Political News

  
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్‌ తెలిపారు.
 ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
దసరా రోజున పాలపిట్టలను సహజ సిద్ధమైన వాతావరణంలో, చెట్లపై స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే తిలకించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పక్షుల బంధనం లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ   అధికారులకు సమాచారం అందించాలని కోరింది.  
ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం బోసిపోయింది. అయితే నగరం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారులు, జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ లతో దాదాపుగా బ్లాక్ అయ్యాయి. ఊళ్లకు వెడుతున్న జనాలతో నిండిన వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు  బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది   తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు.
నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో   ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్..  సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని   క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ,  భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు.
ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.