తిరుమల కల్తీ నెయ్యి కేసు: రూ.130 కోట్ల ఆస్తులు జప్తు.!

Publish Date:Oct 14, 2026

Advertisement

తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు, వారి కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలకు చెందిన దాదాపు రూ.130 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)-2002 కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు సంస్థలకు చెందిన ఆస్తులు అటాచ్.!

ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు చెందిన ఆస్తులు ఉన్నాయి. బోలే బాబా డెయిరీ ప్రమోటర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వారి కుటుంబ సభ్యులతో పాటు సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ జాబితాలో చేర్చింది. ఈ చర్యతో లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది.

పామాయిల్‌తో కల్తీ నెయ్యి తయారీ.. రూ.234.5 కోట్ల సరఫరా.!

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ వంటి నూనెలను ఉపయోగించి కల్తీ నెయ్యి తయారు చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ విధంగా తయారు చేసిన రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.

బోలే బాబా, సుకృతి ఫుడ్స్‌కు చెందిన ఫ్యాక్టరీల్లో కల్తీ నెయ్యి తయారీ జరిగినట్లు దర్యాప్తులో తేలింది. నెయ్యికి సహజమైన రంగు, వాసన, చిక్కదనాన్ని తీసుకురావడానికి మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్లు, లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి పదార్థాలను ఉపయోగించినట్లు గుర్తించారు. వీటి కొనుగోళ్లను రికార్డుల్లో వంట నూనెలుగా చూపిస్తూ నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించినట్లు ఈడీ పేర్కొంది.

నకిలీ లెక్కలు.. హవాలా మార్గంలో నగదు బదిలీలు.!

కల్తీ నెయ్యి తయారీ, సరఫరా వ్యవహారాన్ని సాధారణ డెయిరీ వ్యాపారంగా చిత్రీకరించేందుకు నిందితులు తప్పుడు రికార్డులు సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వేల టన్నుల పామాయిల్‌ను బోగస్ కొనుగోలుదారులకు విక్రయించినట్లు లెక్కలు చూపించడంతో పాటు, రైతులు, వ్యాపారుల పేర్లతో నకిలీ పాలు, నెయ్యి కొనుగోళ్లను నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. స్కిమ్డ్ మిల్క్ వంటి ఉప ఉత్పత్తుల విక్రయాల పేరుతోనూ తప్పుడు లెక్కలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

ఈ లావాదేవీల్లో తొలుత బ్యాంకింగ్ మార్గాల ద్వారా నిధులను బదిలీ చేసి, అనంతరం హవాలా మార్గంలో నగదును వెనక్కి తీసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ఈ నగదును బోగస్ పామాయిల్ కొనుగోలుదారులకు చెల్లింపులు చేయడానికి, బినామీ డెయిరీలకు కమీషన్లు ఇవ్వడానికి, ఇతరులకు లంచాలు చెల్లించడానికి వినియోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఆరు రాష్ట్రాల్లో సోదాలు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్టు.!

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అవినీతి కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు, నెల్లూరులోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలైన ఛార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో గతంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.2.7 కోట్ల నగదు, బ్యాంకు నిల్వలను సీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న విపిన్ జైన్, కైలాష్ చంద్ మంగ్లాలను కూడా అరెస్టు చేసింది.

ఇప్పటివరకు రూ.132.55 కోట్ల ఆస్తులు సీజ్.!

తాజాగా రూ.129.85 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడంతో, ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్ చేసిన, సీజ్ చేసిన లేదా ఫ్రీజ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.132.55 కోట్లకు చేరినట్లు ఈడీ తెలిపింది. కల్తీ నెయ్యి తయారీ నుంచి టీటీడీకి సరఫరా వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, సంబంధిత సంస్థల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపైనా అధికారులు విచారణ జరుపుతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తాజాగా ఈడీ చేపట్టిన భారీ ఆస్తుల అటాచ్‌మెంట్ చర్యలు కేసులో కీలక పరిణామంగా నిలిచాయి.

 

 

 

[ Tirumala Laddu Adulteration Case, TTD Laddu Scam, ED Action, Enforcement Directorate, Rs 129.85 Crore Assets Attached, Tirumala Laddu Ghee Scam, TTD Ghee Adulteration, PMLA Case, ED Hyderabad Zonal Office, Bole Baba Dairy, Sri Vaishnavi Dairy, Sukruti Foods, Vipin Jain, Pomil Jain, Kailash Chand Mangla ]


 

By
en-us Political News

  
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.