టీ బ్యాగ్ లతో టీ తయారు చేసుకుని తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..!

Publish Date:Nov 8, 2024

Advertisement

 

టీ.. భారతీయులకు ఒక ఎమోషన్.  ఒకప్పుడు పట్టణాలలో ప్రజలు,  బయటి షాపులలో మాత్రమే టీ కనిపించేది. కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా టీ ఫీవర్ పాకింది.  ఉదయాన్నే కాఫీలు,  సద్ది అన్నం తినే కల్చర్ నుండి ఉదయాన్నే టీ తాగి, టిఫిన్లు తిని పనులు చేసుకునే స్థితికి కాలం మారింది.  ఇప్పుడు భారతదేశంలో నీటి తర్వాత  అత్యధికంగా వినియోగిస్తున్న పానీయం టీ కావడం గమనార్హం.  చాలామంది టీ ఆకులు,  టీ పొడి కొనుగోలు చేసి టీని తయారు చేసుకుని తాగుతుంటారు. కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు గ్రీన్ టీ,  బ్లాక్ టీ మొదలైనవి తాగుతారు.  ఇవి కూడా తయారు చేసుకోవడానికి సులభంగా ఉంటుందని టీ బ్యాగ్ రూపంలో కొనుగోలు చేస్తారు. అయితే టీ బ్యాగ్ లు ఉపయోగించి తయారు చేసుకునే టీ వల్ల ఆరోగ్యం పాడవుతుందనే విషయాలను వైద్యులు, ఆహార నిపుణులు వెలిబుచ్చుతున్నారు. అసలింతకీ టీ బ్యాగ్ ల వల్ల జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే..


ఉదయాన్నే వేడి నీటిని ఒక పెద్ద కప్పులో పోసి అందులో గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్ వేసి 5 నుండి 10 నిమిషాల తరువాత ఆ పానీయాన్ని తాగడం చాలా మంది చేసే పని.  ఆరోగ్యానికి ఆరోగ్యం,  పని కూడా తక్కువే అనేది వారి భావన. కానీ ఇలా టీ బ్యాగుల ద్వారా తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు.


టీ బ్యాగులు ఉపయోగించడం చాలా తేలిక.  కేవలం వేడి నీటిలో ఈ టీ బ్యాగులను కొన్ని నిమిషాలు ఉంచితే ఆరోగ్యకరమైన టీ తయారవుతుందని అనుకుంటారు.  దీనికి తగ్గట్టుగానే మార్కెట్లో కూడా టీ బ్యాగుల అమ్మకం ఎక్కువ.  ముఖ్యంగా టీ బ్యాగులు కూడా వివిధ రకాల ఫ్లేవర్లలో అమ్ముతుంటారు.  టర్మరిక్ టీ,  మందార టీ,  దాల్చిన చెక్క టీ, చమోమిలే టీ వంటి టీలను కూడా అమ్ముతుంటారు.  ఇవన్నీ శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయని అనుకుంటారు. వీటిలో కెఫీన్ ఉండదు. అయినప్పటికీ ఇవి కూడా డెంజరే.. ఎందుకంటే ఇవి కూడా టీ బ్యాగ్ ల రూపంలో ఎక్కువ వాడతారు.


టీ బ్యాగ్ లలో ఉండే రసాయనాలు శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తాయి.  అంతే కాదు వీటిని ప్యాక్ చేసిన తరువాత ఇందులో ఏమున్నాయో గమనించే అవకాశం ఉండదు. కానీ కొన్ని సార్లు ఈ టీ బ్యాగ్ లలో కీటకాలు,  చనిపోయిన పురుగులు వంటివి కూడా ఉండవచ్చు.  ఈ కారణంగా ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ముఖ్యంగా టీ బ్యాగులను వేడి నీటిలో ఉంచినప్పుడు  టీ బ్యాగుల నుండి మైక్రో ప్లాస్టిక్ విడుదల అవుతుంది.


టీ బ్యాగులలో డయాక్సిన్ లేదా ఎపిక్లోరోహైడ్రిన్ పూత ఉంటుంది. వేడి నీటిలో టీ బ్యాగులను ఉంచినప్పుడు ఈ పూత కరుగుతుంది.  ఇది గ్లాసులోని నీటిలో కలిసిపోతుంది. దీని వల్ల శరీరానికి హాని కలుగుతుంది.  దీర్ఘకాలంగా ఈ టీ బ్యాగులు వాడితే  శరీరానికి మేలు  జరగకపోగా వివిధ రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.

                                                          *రూపశ్రీ.
                                                     

By
en-us Political News

  
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.