బోగస్ డెత్ సర్టిఫికెట్ తో ల్యాండ్ స్కామ్..మాజీ స్పీకర్ తమ్మినేనికి బిగుస్తున్న ఉచ్చు.!?

Publish Date:Jul 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో  భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. శాసనసభ మాజీ స్పీకర్,  వైసీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   శ్రీకాకుళం జిల్లాలో  విలువైన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్నఆరోపణలపై తమ్మినేని సీతారాం  కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.  

బాధితులు, పోలీసు సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న  900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా..  ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా,   స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు  సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. 

సదరు 900 చదరపు గజాల స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ ప్రక్రియను చట్టబద్ధంగా మార్చడానికి కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని ఒక మూడో వ్యక్తిని చట్టబద్ధ వారసుడిగా చూపిస్తూ పత్రాలు సృష్టించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ అధికారుల కళ్లు గప్పి, లేకుంటే వారితో  కుమ్మక్కై ఈ  దందాను నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా  భావిస్తున్నారు. 

ఈ భూ కుంభకోణం కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారులు, సహకరించిన వ్యక్తులు కలిపి ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి నకిలీ రబ్బరు స్టాంప్‌లు, ఫోర్జరీ పత్రాలు, ప్రభుత్వ అధికారుల ముద్రలతో ఉన్న పత్రాలు, అలాగే కుట్రకు ఉపయోగించిన పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం నకిలీ స్టాంపులు తయారు చేసే ముఠా సైతం ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ కుంభకోణానికి  సంబంధించి   స్థానిక సబ్ రిజిస్ట్రార్ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్లు, ఫోర్జరీ వారసత్వ ధృవీకరణ పత్రాలు ఇచ్చినా,  విచారణ లేకుండా సబ్ రిజిస్ట్రార్ దానికి ఎలా ఆమోదం తెలిపారనే దానిపై దర్యాప్తు సాగుతోంది.   మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, రి కుమారుడికి ఈ కుట్రలో ప్రత్యక్షంగా ఏ మేరకు ప్రమేయం ఉందో పరిశీలిస్తున్నట్లు పోలీలు  తెలిపారు. 

Tammineni Sitaram land scam, Srikakulam land irregularities, bogus death certificates, YCP leader Tammineni Sitaram, Sub Registrar office irregularities

By
en-us Political News

  
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి రాసే నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భారీ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏపీలో సంచలనం రేపిన మద్యం రవాణా టెండర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది.
ఈశాన్య భారత రత్నమైన సిక్కిం రాష్ట్రంలో అనూహ్య రీతిలో సంభవించిన ఘోర దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇంగ్లండ్‌తో జరిగిన 3వ వన్డేలో 110 బంతుల్లో 138 పరుగులు చేసిన రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ సంచలన విషయాలు వెల్లడించారు. 2011, 2023 వరల్డ్‌కప్ గాయాలు, 2027 వన్డే ప్రపంచ కప్ సాధించే వరకు హిట్‌మ్యాన్ రిటైర్ కాకపోవడానికి గల అసలు కారణాలు తెలుసుకోండి.
అల్పైన్ టెక్స్‌వర్ల్డ్ ఐపీఓ NSE, BSE లలో రూ. 105 వద్ద ఫ్లాట్‌గా లిస్ట్ అయింది. రూ. 126.25 కోట్ల విలువైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు, కంపెనీ బిజినెస్ ప్లాన్స్, పూర్తి స్టాక్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
ఆల్ట్రాటెక్ సిమెంట్ క్యూ1 ఫలితాల్లో నికర లాభం 17% పెరిగి రూ. 2,599 కోట్లకు చేరింది. నువామా మరియు ఇతర బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ధరను రూ. 15,209 వరకు పెంచాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
పేటీఎం క్యూ1 ఫలితాల్లో నికర లాభం 79% పెరిగి రూ. 220 కోట్లకు చేరింది. షేర్లు లాభాల్లో దూసుకుపోతుండగా, గోల్డ్‌మన్ శాక్స్, సిటీ సంస్థలు భారీ టార్గెట్స్ ఇచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడే చదవండి.
2026 జూలై 21 నాటి NYT Strands Game 870 హింట్స్, స్పాంగ్రామ్ మరియు అన్ని సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. Write there థీమ్‌తో ఉన్న ఈ పజిల్‌ను సులభంగా సాల్వ్ చేయడానికి కావలసిన క్లూస్ మరియు పూర్తి సమాచారం మీకోసం!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.