జయ కేబినెట్ మంత్రులు వీరే..
Publish Date:May 23, 2016
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోసారి ప్రమాణం చేశారు. మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆమె చేత ప్రమాణం చేయించారు. జయతో పాటు 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత కేబినెట్: * జయలలిత (ముఖ్యమంత్రి): ప్రజావ్యవహారాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, సాధారణ పాలన, జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, హోం.
1. పనీర్‌సెల్వం : ఆర్థికశాఖ; వ్యక్తిగత, పాలనా సంస్కరణలు
2. దిండిగల్ శ్రీనివాసన్ : అటవీ శాఖ
3. ఎడప్పది కే పళనిస్వామి : జాతీయ రహదారులు, ప్రజా పనులు, చిన్న పోర్టులు
4. సెల్లుర్ కే రాజు : సహకార, కార్మిక శాఖ
5. తంగమణి : విద్యుత్తు, ఎక్సైజ్
6. వీపీ వేలుమణి : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి, ప్రత్యేక పథకాల అమలు
7. కే జయకుమార్ : మత్స్య శాఖ
8. షణ్ముగం : న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు
9. కేపీ అంబజగన్ : ఉన్నత విద్య
10. డాక్టర్ వీ సరోజ : సంక్షేమం, పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం
11. కేసీ కరుప్పన్నన్ : పర్యావరణం
12. ఎంసీ సంపత్ : పరిశ్రమలు
13. ఆర్ కామరాజ్ : ఆహారం, పౌరసరఫరాలు, హెచ్‌ఆర్‌అండ్‌సీఈ
14. ఓఎస్ మణియన్ : చేనేత, టెక్స్‌టైల్స్
15. ఉడుమలై రాధాకృష్ణన్ : పట్టణాభివృద్ధి, హౌసింగ్
16. సీ విజయభాస్కర్ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
17. ఎస్‌పీ షణ్ముగనాథన్ : పాలు, డెయిరీల అభివృద్ధి
18. ఆర్ దొరైకన్ను : వ్యవసాయ, పశుసంరక్షణ
19. కదంబుర్ రాజు : సమాచారం, ప్రచారం
20. ఆర్‌బీ ఉదయ్‌కుమార్ : రెవెన్యూ
21. కేటీ రాజేంద్ర బాలాజీ : గ్రామీణ పరిశ్రమలు
22. కేసీ వీరమణి : వాణిజ్య పన్నులు
23. పీ బెంజమిన్ : పాఠశాల విద్య, క్రీడలు, యువజన సంక్షేమం
24. వెల్లమండి ఎన్ నటరాజన్ : పర్యాటకం
25. ఎస్ వలర్‌మతి : వెనకబడిన వర్గాలు, మైనార్టీల సంక్షేమం
26. వీఎం రాజలక్ష్మి : ఆదిద్రవిడార్, గిరిజన సంక్షేమం
27. డాక్టర్ ఎం మణికందన్ : ఐటీ
28. ఎంఆర్ విజయభాస్కర్ : రవాణా
http://www.teluguone.com/news/content/-tamil-nadu-cm-39-60793.html





